సూడాన్ వ్యక్తితో మైనర్ బాలిక పెళ్లి: ఖాజీ పరారీ

వివరాలు ఇలా ఉన్నాయి - ఖాజీ ఫిబ్రవరి 14వ తేదీన మైనర్ బాలికతో సూడాన్‌కు చెందిన వయస్సు మళ్లిన వ్యక్తితో మైనర్ బాలిక వివాహాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ఖాజీపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. గోల్కొండ డివిజన్‌కు చెందిన ఖాజీ అధిపతి అతన్ని రెండు సార్లు ఆ హోదా నుంచి తొలిగించినట్లు తెలుస్తోంది.
అయితే, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని ఖాజీగా కొనసాగుతున్నాడు. ఖాజీలు ఎవరికి కూడా జవాబుదారీలు కారని అంటున్నారు. హైదరాబాదులో 14 మంది ఖాజీలున్నారని, వారికి పలువురు డిప్యూటీలున్నారని అంటున్నారు.
సూడాన్ వ్యక్తితో మైనర్ బాలిక వివాహం జరిపించిన ఖాజీని గుర్తించడం కష్టమేనని అంటున్నారు. ఖాజీలు ఇచ్చే సియానామా (ఖాజీలకు ఇచ్చిన వివాహం లఘు పుస్తకం) ఇస్తే తప్ప గుర్తు పట్టడానికి వీలు కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications