స్టీల్‌ప్లాంటులో పేలుడు: చెలరేగిన మంటలు(ఫొటోలు)
విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలోని రెండో బ్లాస్ట్‌ఫర్నేస్‌లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 1.15 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.

సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విశాఖ ఉక్కు సీఎండీ మధుసూదన్‌తో సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.

పునరుద్ధరణ పనులపై చర్చించారు. ప్రమాద నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.












Click it and Unblock the Notifications