ముఖ్యమంత్రి అతిథి గృహం లింగమనేని ఎస్టేట్ సమీపంలో మంటలు
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి - ఉండవల్లి కరకట్ట పైన సోమవారం నాడు అగ్ని ప్రమాదం సంభవించింది. లంక భూముల్లో ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి కొద్ది దూరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథి గృహం లింగమనేని ఎస్టేట్ ఉంది.
దీంతో, చంద్రబాబు అతిథి గృహంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది లంక భూముల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. మంటలు ఆర్పేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు.

అనంతపురంలో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ
అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఓ ఖైదీ తప్పించుకున్నాడు. హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. కర్నూలు జిల్లా చిందుకూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి ఓ హత్య కేసులో దోషిగా తేలాడు. ప్రస్తుతం అతడు అనంతలోని ఓపెన్ ఎయిర్ జైల్లో ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే సోమవారం ఉదయం శ్రీధర్ రెడ్డి జైలు నుంచి పరారైనట్లు జైలు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం పోలీసులు శ్రీధర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
మాజీ ఎంపీ అల్లుడి అరెస్ట్?
అనంతపురం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ అల్లుడు అరెస్టయినట్లుగా తెలుస్తోంది. అతనిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో పెళ్లి చేసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతని పైన పలు ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications