15 ఏళ్ల బాలికపై వృద్ధుల లైంగిక దాడి: మహిళ సహకారం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఓ 15 బాలికపై ఇద్దరు వృద్ధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అందుకు ఓ మహిళ వారికి సహకరించింది. ఈ సంఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లోని రామలింగేశ్వరపేటలో జరిగింది.
బాలిక శ్లోకాలు నేర్చుకోవడానికి 85 ఏళ్ల వృద్ధుడి వద్దకు వస్తుంటుంది. అలా వచ్చిన సమయంలో మరో 85 ఏళ్ల వృద్ధుడితో కలిసి అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లైంగిక దాడి విషయాన్ని బాలిక తన ఆంటీకి, పక్కనే ఉండే సైకాలిజిస్టుకు చెప్పింది.

చైల్డ్ సైకాలజిస్టు సుజాత విషయాన్ని హైదరాబాదులోని బాలల హక్కుల సంఘానికి నివేదించింది. దీంతో కేసును సంఘం రాష్ట్రంలోని బాలల హక్కుల కమిషన్‌కు అందజేసింది. బాధితురాలు తన ఆంటీ వద్ద అద్దె ఇంట్లో ఉంటోంది.
గురువుగా చెప్పే 85 ఏళ్ల వృద్ధుడి వద్దకు అమ్మాయి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడానికి వెళ్తుంటుంది. బాలిక జయరామ్ అనే 85 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో అంటీతో కలిసి అద్దెకు ఉంటుంది. గురువుకు, జయరామ్‌కు బాలికపై లైంగిక దాడి చేసేందుకు రాజేశ్వరి అనే మహిళ సహకరించింది. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications