ఇంట్లోకి పిలిచి నాలుగేళ్ల బాలికపై పొరుగు వ్యక్తి రేప్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బాలికపై దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికపై పొరుగున ఉండే వ్యక్తే అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు సోమవారంనాడు చెప్పారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వాడి గ్రామం వన్నాజిపేట శివారు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
బాలికపై తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా గంగాధర్ (24) అనే కూలీ ఆ ఘాతుకానికి పాల్పడినట్లు సిరికొండ పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి. శంకర్ చెప్పారు. నిందితుడు ఆడుకుందాం రమ్మని బాలికను తన ఇంట్లోకి పిలిచి ఆమెపై అరాచానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు పారిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications