దారుణం: అమ్మాయిపై ప్రైవేట్ కారు డ్రైవర్ అత్యాచారం
ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ అమ్మాయి తల్లి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అత్యాచారానికి పాల్పడిన 30 ఏళ్ల డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని పి. శ్రీనివాస్‌గా గుర్తించారు. అతను హెచ్‌బి కాలనీలో నివసిస్తూ సుబ్బలక్ష్మినగర్‌లోని ఓ ఇంటిలో కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అేద ఇంట్లో అమ్మాయి పని మనిషిగా ఉంటోంది.

అమ్మాయిని శ్రీనివాస్ గురువారం సాయంత్రం తాము పనిచేస్తున్న ఇంటి సమీపంలోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడని, ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయాన్నంతా బాధితురాలు తల్లికి చెప్పింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పరీక్షల నిమిత్తం బాధితురాలిని కింగ్ జార్జి ఆస్పత్రికి పంపించారు. అమ్మాయి మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, ఆమెకు 21 ఏళ్లు ఉంటాయని ఆమె యజమానులు చెబుతున్నారు. తాము బర్త్ సర్టిఫికెట్ పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications