‘అమ్మవారు నైవేద్యం ఆరగించారు’: అర్ధరాత్రి ఆలయానికి భారీగా భక్తులు
పశ్చిమగోదావరి: తనకు నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని(అన్నం) కనకదుర్గమ్మ ఆరగించారట. ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి అర్ధరాత్రైనా క్షణాల్లో విస్తరించింది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అప్పటికప్పుడు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి పూజల్లో భాగంగా అమ్మవారికి పూజల అనంతరం నైవేద్యం పెట్టిన అర్చకులు గర్భగుడి తలుపులు వేశారు.

అనంతరం అరగంట తర్వాత తలుపులు తెరిచి చూడగా, అమ్మవారి చేతిలో స్పూను, నోటికి నైవేద్యంగా పెట్టిన అన్నం మెతుకులు కనిపించాయి.
అంతేగాక, గర్భగుడి ప్రాంగణంలో అమ్మవారి అడుగులు కూడా పూజారులు, ఆలయ కమిటీ సభ్యులకు కనిపించాయట. ఈ విషయం నగరంలో వేగంగా వ్యాపించింది. దీంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications