పెద్ద మనసు చాటుకున్న బీఎస్ఎఫ్- ఏపీ వ్యక్తిని కుటుంబంతో కలిపిన జవాన్లు

BSF: సరిహద్దు భద్రతా దళం గొప్ప మనసు చాటుకుంది. కంటి మీద కునుకు లేకుండా నిరంతరం పహారా కాస్తూ దేశాన్ని కంటిపాపలా కాపాడుకుంటోన్న బీఎస్ఎఫ్ జవాన్లు.. ఓ కుటుంబాన్ని కలిపారు. దారి తెన్ను తెలియకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని ఆయన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

ఆ వ్యక్తి- మన తెలుగువాడే. ఏపీకి చెందినవాడే. పేరు వెంకట్రావు. వయస్సు 50 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా మండపేట సమీపంలోని నేలటూరు ఆయన స్వగ్రామం. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తిరుగుతున్న వెంకట్రావును బీఎస్ఎఫ్ జవాన్లు కాపాడారు. కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

Missing Andhra Man found near the Jammu s Akhnoor border and reunited with his family by BSF

వెంకట్రావు దాదాపుగా మూడు నెలలుగా కనిపించకుండా పోయారు. ఇంటి నుండి తప్పిపోయారు. ఈ మూడు నెలల కాలంలో వెంకట్రావు కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెదికారు. బంధుమిత్రులనూ సంప్రదించారు. అవేవీ కూడా ఫలించలేదు.

ఎలా చేరుకున్నాడో తెలియట్లేదు గానీ వెంకట్రావు నేలటూరు నుంచి ఏకంగా జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లారు. అఖ్నూర్ సెక్టార్‌లో సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు ఆయనను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఏడాది మార్చి 31వ తేదీన పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న సమయంలో వెంకట్రావు కనిపించారు. తనకు సంబంధించిన విషయాలు గానీ, ఇతర వివరాలు గానీ స్పష్టంగా చెప్పలేకపోయారు. దీనితో అధికారులు రంగ ప్రవేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నేలటూరుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నాలు చేశారు.

పూర్తి వివరాలన్నీ ధృవీకరించుకున్న తరువాత ఈ నెల 11వ తేదీన ఆయనను సురక్షితంగా కుటుంబంతో కలిపారు. బీఎస్ఎఫ్ జవాన్ల సహకారంతో దాదాపు మూడు నెలల తరువాత వెంకట్రావు సురక్షిత తిరిగి రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషపడ్డారు. బీఎస్ఎఫ్ జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

అటు సరిహద్దు భద్రత ఇటు సామాజిక బాధ్యత- రెండింటికీ బీఎస్ఎఫ్ జవాన్లు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారని కుటుంబ సభ్యులు చెప్పారు. దేశ రక్షణ మాత్రమే కాకుండా పౌరులను కాపాడుకోవడంతో వారి చిత్తశుద్ది మరోసారి నిరూపితమైంది ఈ ఘటనతో. దేశ పౌరులను కాపాడటం తమ సామాజిక బాధ్యతగా బీఎస్ఎఫ్ అధికారులు పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+