ఫేసుబుక్‌లో సూసైడ్ నోట్ పెట్టిన పూజారి దొరికాడు
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లిలో పది రోజులు క్రితం అదృశ్యమైన పూజారి శివస్వామి, ఆయన భార్య సురక్షింతగానే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోని రాయచూర్‌లో పూజారి దంపతులను పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే... పట్టణంలోని బర్మావీధిలో ఉన్న షిరిడిసాయిబాబా మందిర ప్రధాన అర్చకుడు శివస్వామి, తన భార్య జ్యోతితో కలిసి నాలుగురోజుల కిందట అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో శివస్వామి సూసైడ్‌నోట్ వెలుగు చూసింది.

ఆలయ ధర్మకర్తలు మందలించిన కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూజారి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను పూజించే సాయిబాబా విగ్రహంతో కలసి ఫొటో తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు ధర్మకర్తలు దూషించారని ఆయన ఆ నోట్‌లో తెలిపాడు.
దీనిపై సుమోటో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పూజారి దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు శివస్వామి దంపతులు రాయచూర్‌లో ఉన్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications