బస్‌లో అదృశ్యమైన టెక్కీ..బావని పెళ్లి చేసుకొని వచ్చారు

దీంతో తాను మేనబావను పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. పోలీసులు వారి నుండి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. గత నెల 26వ తేదీన ఆమె విధులు నిర్వర్తించే బెంగళూరుకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆమెను ఎంజీబీఎస్‌లో వదిలి వెళ్లారు. బెంగళూరుకు చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. 26న ఎంజీబీఎస్ నుండి బస్‌లో కొంతదూరం వెళ్లాక దిగిపోయిన మహిళా టెక్కీ తన మేనబావకు ఫోన్ చేశారు. ఆయన ఆమెను కూకట్ పల్లిలోని తన నివాసానికి తీసుకు వెళ్లారు. మరుసటి రోజు కూకట్ పల్లిలోని ఆర్య సమాజ్‌లో వీరు వివాహం చేసుకున్నారు.
పోలీసులు దర్యాఫ్తులో భాగంగా కుటుంబ సభ్యులను ఆరా తీయగా ఆమె మేనబావతో వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్నారు. కేసు నమోదై ఉండటంతో భరణి తన భర్తతో కలిసి అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించారు.
వేధింపులు భరించలేక వడ్డ్డీ వ్యాపారిపై కత్తితో దాడి
వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక అప్పు తీసుకున్న ఓ యువకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఎంఎస్ మక్తాకు చెందిన మహ్మద్ ముకరం (27) స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. డబ్బులు అవసరం కావడంతో స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారి హర్షద్ వద్ద 15 రోజుల క్రితం అధిక వడ్డీకి 3 వేల రూపాయలు తీసుకున్నాడు. దీనికిగాను వాహనం కాగితాలను అతనికిచ్చాడు. డబ్బులు ఇవ్వాలంటూ హర్షద్ ఐదు రోజులుగా ముకరంపై ఒత్తిడి తెస్తున్నాడు.
ఈ విషయమై సోమవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. హర్షద్, అతని స్నేహితులు నెక్లెస్‌రోడ్‌లో ముకరంపై దాడి చేసి కొట్టారు. ఆగ్రహం చెందిన ముకరం ఎలాగైనా హర్షద్‌కు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు. హర్షద్ మంగళవారం కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయ డంతో తన వద్ద ఉన్న కత్తితో మెడపైన పొడి చాడు. స్థానికులు అతనిని అడ్డుకోవడంతో పాటు చితకబాది పోలీసులకు అప్పగించారు. హర్షద్ ఫిర్యాదుతో ముకరంపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications