విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవాని కథ సుఖాంతం.. 15ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు... కలిపిన ఫేస్‌బుక్

|
Google Oneindia TeluguNews

ఉత్కంఠను రేపిన విజయవాడ యువతి భవాని కథ సుఖాంతమైంది. అనేక తర్జన భర్జనల తర్వాత, భవాని పెంచిన తల్లిదండ్రుల వద్ద కొన్ని రోజులు కన్న తల్లిదండ్రుల కొన్ని రోజులు ఉంటానని చెప్పింది. భవాని నిర్ణయంతో వారు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఆమె నిర్ణయంతో ముందుగా పెంచిన తల్లిదండ్రుల వద్ద, ఆ తర్వాత కన్నవారి వద్దకు వెళతానని భవాని తెలిపింది.

తప్పిపోయిన భవాని

తప్పిపోయిన భవాని

హైదరాబాద్‌లో పదిహేనళ్ల క్రితం అదృశ్యమై విజయవాడలో అచూకి లభించింది. వివరాల్లోకి వెళితే... విజయవాడ పడమట లంకకు చెందిన జయరాణి వ్యక్తిగత పనిమీద హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు వచ్చింది. అయితే అదే సమయంలో చిన్నపిల్లగా ఉన్న భవాని ఓ ఇంటివద్ద తప్పిపోయి తిరుగుతుండంతో గమనించిన జయరాణి ఆమెను చేరదీసింది. దీంతో తల్లిదండ్రుల కోసం వెతికింది. అయితే వారి వివరాలు తెలియకపోవడంతో స్థానిక సనత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి, భవానితో పాటు విజయవాడకు చేరుకుంది. భవాని స్వంత తల్లిదండ్రులు కూడ ఎలాంటీ కేసు నమోదు చేయకపోవడంతో ఆమె అడ్రస్ కనుక్కోలేక పోయారు.

15 సంవత్సరాలు పెంచిన తల్లివద్ద భవాని

15 సంవత్సరాలు పెంచిన తల్లివద్ద భవాని

సీన్ కట్‌చేస్తే... భవాని జయరాణి వద్ద పదిహేను సంవత్సరాలు పెరిగుతోంది. ఆమె బాగోగులను జయరాణి చూసుకుంటుంది. జయరాణి విజయవాడలోనే కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తనకు మరో ఆడపిల్ల కూడ ఉండడంతో ఇళ్లల్లో పని చేస్తూ... కాలం వెళ్లదీస్తోంది. ఈ నేపథ్యంలోనే భవానిని కూడ తాను పని చేసే ఇంటిలో పనిలో పెట్టేందుకు కొద్ది రోజుల క్రితం తీసుకువెళ్లింది. భవానిని పనిలో పెట్టుకోవాల్సిందిగా ఇంటి యజమాని వంశీని కోరింది. అమెకు సంబంధించిన గత వివరాలను కూడ చెప్పింది.

ఫేస్ బుక్ ద్వార..

ఫేస్ బుక్ ద్వార..

దీంతో భవాని వివరాలను తెలుసుకున్న యజమాని వంశీ భవాని చిన్ననాటీ ఫోటోలను, ఆమెకు సంబంధించిన వివరాలను సోషల్ మీడీయా అయిన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో భవాని ఫోటోతోపాటు వివరాలు చూసిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కుటుంబం ఫేస్‌బుక్ ద్వార వంశీతో మాట్లాడారు. దీంతో భవాని సైతం వీడియో కాల్ మాట్లాడిన వ్యక్తిని తన సోదరుడిగా గుర్తు పట్టింది. అనంతరం అదే ఫోన్‌లో స్వంత తల్లిదండ్రులు కూడ మాట్లాడారు. దీంతో ఆమె స్వంత తల్లిదండ్రులు అయిన మాధవరావు, వరలక్ష్మి, సోదరులు విజయవాడకు వెళ్లారు.

15 సంవత్సరాల తర్వాత కన్న తల్లిదండ్రుల వద్దకు

15 సంవత్సరాల తర్వాత కన్న తల్లిదండ్రుల వద్దకు

దీంతో భవాని తమ కూతురు అంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో భవాని డీఎన్ఎ పరీక్షించిన అనంతరం వారి స్వంత తల్లిదండ్రులుగా గుర్తించారు. అయితే భవాని తమ వద్దే ఉండాలంటూ పెంచిన తల్లి జయరాణి కూడ పోలీసులను ఆశ్రయించింది. దీంతో న్యాయవాదుల సలహాలతో పాటు ఇతర భవాన్ని నిర్ణయాన్ని తీసుకున్నారు. భవాని ఇద్దరి వద్ద ఉంటానని చెప్పడంతో వివాదం ముగిసింది. కాగా భవాని అసలు తల్లిదండ్రుల స్వంత ఊరు శ్రీకాకుళం జిల్లా చీపురు పల్లి, అయితే వారు కొన్ని సంవత్సరాల క్రితం పనుల కోసం హైదరబాద్‌కు చేరుకున్న సమయంలో ఆమె తప్పిపోయి పద్నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి స్వంత తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

English summary
The story of Vijayawada's young woman Bhavani ended with happy. Bhawani said that she will be stay at parents somedays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X