అమరావతిపై రూటు మార్చిన వైసీపీ - కేంద్రానికి తాజా డిమాండ్..!!

రాజధాని అమరావతి పై వైసీపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నికల్లో పరాజయం తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతి కేంద్రంగా పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ సమయంలోనే అమరావతి పైన పార్లమెంట్ వేదికగా వైసీపీ కీలక డిమాండ్ కేంద్రం ముందు ఉంచింది.

కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో జరిగిన చర్చలో వైసీపీ నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతికి కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ 15 వేలను రుణంగా కాకుండా..గ్రాంటుగా మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించాని కోరారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినటానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తున్న ట్లు మిథున్ స్పష్టం చేసారు. పదేళ్లు గడిచినా విశాఖ మెట్రో, కడప స్టీల్ ఊసే లేకపోవటం ఏంటని ప్రశ్నించారు.

Mithun Reddy Demands Central to announces rs 15000 as Grant for Captial Amaravati

రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయని మిథున్ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తనను తిరగనీయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.తన పైన దాడి చేయటంతో పాటుగా తన వాహనం ధ్వంసం చేసారని వివరించారు. తన పైన దాడి చేసి తన పైనే హత్యాయత్నం కేసు నమోదు చేసారని చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని...హింసకు చమరగీతం పాడాలని మిథన్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+