వైసిపిలో వేదన, అందుకే టిడిపిలోకి: జగన్‌పై ఆదిరెడ్డి తీవ్రవ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపిలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లేదన్నారు. తాను ఆ పార్టీలో తీవ్ర మనోవేదన అనుభవించానని చెప్పారు.

MLA Adireddy says he faced problems in YSRCP

ఈ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు. అప్పారావు కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని ప్రచారం సాగినప్పటికీ, ఇరవైతో ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLA Adireddy says he faced problems in YSRCP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X