సచివాలయంలో బీర్ సీసాలు..ఎమ్మెల్యే ఏం చేశారంటే..!
గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం ఉంటుంది. ప్రజలు తమ ఇంటి దగ్గర నుండే ప్రభుత్వ సేవలను పొందవచ్చు. సచివాలయ సేవలను పారదర్శకంగా అందించడం ద్వారా కరప్షన్ నియంత్రించబడింది. దీంతో పాటు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమయం వృథా చేయాల్సిన అవసరం లేకుండాపోయింది.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాలపై వివక్ష చూపుతూ వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ వ్యవస్ధను రెవెన్యూ వ్యవస్థలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వాలంటీర్లను తొలగించిన ప్రభుత్వం, సచివాలయ సిబ్బందితోనే పనులు చేయిస్తోంది. దీంతో సచివాలయాలకు రక్షణ కరువైంది. సచివాలయంలో తాగిన బీర్ సీసాలు ప్రత్యక్షం అయ్యాయి.

కొందరు ఆకతాయిలు సచివాలయంలోనే మద్యం సేవించి అర్థరాత్రుళ్లు నానా హంగామా సృష్టిస్తున్నారు. ఈ విషయం ఏకంగా ఎమ్మెల్యే విజిట్‌లోనే వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అవనిగడ్డలో గ్రామ సచివాలయం-1 కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అవనిగడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా సచివాలయాన్ని తనిఖీ చేశారు.
ఈ సమయంలో అవనిగడ్డలో గ్రామ సచివాలయం-1 కార్యాలయం గదుల్లోనే మద్యం సేవిస్తున్నారు. కార్యాలయం గదుల్లో, మెట్లపై ఎటు చూసినా తాగి పడేసిన మద్యం సీసాలు కనిపించాయి. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ సచివాలయంలోనే మద్యం తాగుతుంటే ఏం చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. ఇతరులు లోపలికి రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని ప్రశ్నించారు.గ్రామ సచివాలయ భవనం, గదులను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications