వైసీపీలో మరో వికెట్ పడబోతుందా..! : 'జంపింగ్ జాబితాలోకి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..!!'
గిద్దలూరు : ప్రకాశం జిల్లా రాజకీయాలను గమనిస్తే.. వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మారుతున్న తాజా రాజకీయాల ప్రకారం ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఫిరాయించిన 17 మంది ఎమ్మెల్యేల జాబితాలో మరో పార్టీ నేత పేరు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఓసారి ఆయన టీడీపీలో చేరుతున్నట్టుగా వార్తలు వచ్చినా..! అప్పట్లో అదేమి లేదని కొట్టిపారేశారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి.

అయితే, తాజా రాజకీయ పరిస్థితుల ప్రకారం, పార్టీ మారే యోచనలో భాగంగా ఇప్పటికే తన అనుచరులతో ఎమ్మెల్మే అశోక్ రెడ్డి మంతనాలు కూడా జరిపారట. రాచర్ల మండలానికి చెందిన కొంతమంది ముఖ్య కార్యకర్తలతో పార్టీ మార్పు అంశం చర్చించినట్టుగా తెలుస్తోంది. టీడీపీలో చేరుదామా..! అన్న ప్రతిపాదనను ఆయన కార్యకర్తల ముందు ఉంచినట్టు సమాచారం.
ఇప్పటిదాకా దీనిపై అధికారిక ప్రకటనేది లేకపోయినప్పటికీ, కార్యకర్తల నుంచి పూర్తి మద్దతు లభిస్తే అశోక్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications