హిందూపురం జిల్లాకేంద్రం కోసం రంగంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ; రేపు భారీ ర్యాలీ, మౌనదీక్ష!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల జిల్లా కేంద్రాల విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలోని హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉన్న హిందూపురాన్ని కాదని పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఉంచాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.
ఏపీ
డిప్యూటీసీఎం
పుష్ప
శ్రీవాణికి
బిగ్
రిలీఫ్..
కులవివాదంపై
అప్పిలేట్
అధారిటీ
కీలకఉత్తర్వుతో
ఊరట

హిందూపురం జిల్లా కేంద్రం చెయ్యాలని రంగంలోకి దిగనున్న బాలకృష్ణ
ప్రతిపాదిత హిందూపురం జిల్లాకు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఉంచాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురానికి జిల్లా కేంద్రానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయని అయినా పుట్టపర్తిని జిల్లా కేంద్రం చెయ్యటం దేనికని ప్రశ్నించారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికుల నుండి కూడా పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం జిల్లా కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారు. దీక్ష కోసం ఇప్పటికే బాలకృష్ణ హిందూపురం చేరుకున్నారు.

హిందూపురంలో భారీ ర్యాలీ... ఆపై బాలకృష్ణ మౌన దీక్ష
బాలయ్య
బాబు
నేతృత్వంలో
శుక్రవారం
నాడు
భారీ
ర్యాలీ
నిర్వహించి,
ర్యాలీ
అనంతరం
హందూపూర్‌లో
బాలకృష్ణ
మౌన
దీక్ష
చేపట్టనున్నారు.
శుక్రవారం
ఉదయం
హిందూపురం
పట్టణంలోని
పొట్టిశ్రీరాములు
విగ్రహం
నుంచి
అంబేద్కర్
విగ్రహం
వరకు
ర్యాలీ
నిర్వహించనున్నట్టు
టిడిపి
వర్గాలు
వెల్లడించాయి.
ఆ
తర్వాత
పుట్టపర్తి
కాకుండా
హిందూపురాన్ని
జిల్లా
కేంద్రంగా
చేయాలని
డిమాండ్
చేస్తూ
శుక్రవారం
హిందూపురంలో
బాలయ్యబాబు
ధర్నాకు
దిగనున్నారు.
బాలయ్య
అఖిలపక్ష
సమావేశంలో
ప్రసంగించి
ఆపై
ధర్నాకు
దిగనున్నారు.

హిందూపురం జిల్లా కేంద్రం చెయ్యటం కోసం భవిష్యత్ కార్యాచరణకు అఖిలపక్ష నాయకులతో భేటీ
నిరసన కార్యక్రమం సాయంత్రం అనంతరం అఖిలపక్ష నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై బాలయ్య చర్చించనున్నారు.అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశం కానున్నారు. హిందూపురం జిల్లా కేంద్రం చెయ్యటం కోసం భవిష్యత్ కార్యాచరణకు బాలకృష్ణ శ్రీకారం చుట్టనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూపురం ప్రజలు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని ప్రధాన కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రమని, సహజంగానే జిల్లా కేంద్రంగా కూడా ఉండాలని వారు సూచిస్తున్నారు.

హిందూపురంలో వైసీపీ నాయకులపై పెరుగుతున్న ఒత్తిడి
హిందూపురం జిల్లా కేంద్రం చేస్తామని చెప్పిన వైసీపీ నేతలను సైతం హిందూపురం ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం కోసం కృషి చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించింట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంపై పుట్టపర్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తే, హిందూపురం వాసులు మాత్రం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

పట్టు బిగిస్తున్న బాలయ్య .. వైసీపీ సర్కార్ కు కొత్త తలనొప్పి
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పుట్టపర్తి నుంచి హిందూపురానికి హెడ్‌క్వార్టర్స్‌ను మార్చే వరకు తాను విశ్రమించేది లేదని బాలయ్య బాబు స్పష్టం చేశారు. బాలయ్య బాబు కూడా గేరు మార్చి ధర్నాకు దిగడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇది వైఎస్సార్సీపీకి కొత్త తలనొప్పిగా మారనుంది. హిందూపురం జిల్లా కేంద్రం కోసం పట్టు బిగుస్తున్న వేళ ప్రభుత్వం హిందూపురం విషయంలో నిర్ణయం మార్చుకుంటుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.