Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాడేపల్లికి సీనియర్ల క్యూ - సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ..!!

సీఎం జగన్ ఎన్నికల నిర్ణయాలపైన కసరత్తు చేస్తున్నారు. సీట్ల ఖరారు పైన ఫోకస్ చేసారు. సర్వే నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేతలు పలువురు తమ వారుసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీనియర్లు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం అవుతున్నారు. సీఎం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

సీఎం జగన్ కసరత్తు : వైసీపీలె టికెట్ల ఖరారు పై సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలోనే సీనియర్ నేతలు పలువురు తమ వారసులకు సీట్ల విషయంలో సీఎం జగన్ తో సమావేశం అవుతున్నారు. గతంలోనే వారసుల వ్యవహారం తెర పైకి వచ్చింది. వారసుల విషయంలో పలువురు కోరుతున్నారని...ఈ సారికి సీనియర్లే పోటీలో ఉంటారనే సంకేతాలు పార్టీ నుంచి వచ్చాయి.

jagan13

దీంతో సీఎం జగన్ అసలు వారసులకు ఈ సారి సీట్లు ఇవ్వరనే ప్రచారం సాగింది. కానీ, కొందరి విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడుకి సీటు ఖరారు చేసారు. అదే విధంగా మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు ప్రజలతో మమేకం అవుతున్నారు.

వారసుల కోసం సీట్లు : దీంతో, తమ వారసుల కోసం సీట్లను కోరుతున్న నేతలు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన తాజాగా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. టీటీడీ బోర్డు ఏర్పాటు కసరత్తులో భాగంగా భూమనను పలిపించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్ రెడ్డికి తిరుపతి సీటు ఇవ్వాలని మరోసారి సీఎం జగన్ ను భూమన అభ్యర్ధించారు.

ప్రస్తుతం అభినయ్ తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఇదే తరహాలో శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, చెన్నకేశవ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు తమ వారసులకు సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రేపల్లె నుంచి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తనయుడికి ఈసారి టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు.

jagan13

సీఎం నిర్ణయంపై ఉత్కంఠ : స్పీకర్ తమ్మినేని, ధర్మాన, విశ్వరూప్,తిప్పల నాగిరెడ్డి ఇలా పలువురు నేతలు సీఎం జగన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా రామచంద్రాపురంలో రాజ్యసభ సభ్యుడు బోస్ తన కుమారుడి సీటు కోసం మంత్రి వేణుతో పోటీ పడుతున్నారు. తాజాగా ఇద్దరి మధ్య వివాదం పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం సూచనలతో బోస్ వెనక్కు తగ్గారు.

అదే విధంగా ఆర్దిక మంత్రి బుగ్గన సైతం సీఎం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. పలు సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించేందుకు క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో, ఇప్పుడు సీఎం జగన్ అందరికీ ఒకే విధమైన నిర్ణయం తీసుకుంటారా.. ఎవరికి అవకాశం ఇస్తారనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+