అంత్యక్రియల్లో నాయకురాలి తల్లి పాడెను మోసిన టీడీపీ ఎమ్మెల్యే..

అంత్యక్రియలకు హాజరైన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఆమె పాడెను మోశారు.

ఉండి: టీడీపీ నాయకురాలు మంతెన రమాదేవి తల్లి రుద్రరాజు పద్మావతి(90) బుధవారం నాడు మృతి చెందారు. అంత్యక్రియలకు హాజరైన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఆమె పాడెను మోశారు. అంతకుముందు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాగా, టీడీపీ నాయకురాలు రమాదేవి శివ స్వచ్చంద సంస్థ కో-ఆర్డినేటర్ గాను సేవలందిస్తున్నారు. ఆమె తల్లి మరణించారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శివరామరాజు, వారి ఇంటికి వెళ్లి రమాదేవిని ఓదార్చారు. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు.

MLA Siva Rama Raju Carried dead body of a party leader mother in west godavari

ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు మంతెన చంటిరాజు, ఉండి ఏఎంసీ చైర్మన్‌ కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, తదితరులు ఆయన వెంట రమాదేవి ఇంటికి వెళ్లారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొనడంతో పాటు స్వయంగా ఎమ్మెల్యే శివరామరాజు పాడె మోయడాన్ని స్థానికులు ఆసక్తి గమనించారు.

హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులకు పరామర్శ:

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శివరామరాజు పరామర్శించారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన హేమంత్ కుమార్‌ మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+