వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేత చెవిరెడ్డి ప్రత్యేక గుర్తింపు - ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ సీనియర్ నేతకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రభుత్వ విప్.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక 'ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో స్థానం లభించింది. అందునా అరుదైన అంశంలో ఆయనకు ఈ గుర్తింపు లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న చెవిరెడ్డిని ఈ స్థానం దక్కింది. తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడ అకార్డ్‌ స్కూల్‌ ఆవరణలో ఎమ్మెల్యే చెవిరెడ్డి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

చెవిరెడ్డికి గోల్డ్ మెడల్.. ప్రశంసలు

చెవిరెడ్డికి గోల్డ్ మెడల్.. ప్రశంసలు

పర్యావరణం పరిరక్షణ దిశగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌' సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్‌ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని అందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే నియోకవర్గం పరిధిలో ఇంత పెద్ద సంఖ్యలో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.

Recommended Video

ఏపి మంత్రివర్గ సమావేశం వాయిదా వెనుక కారణం *AndhraPradesh | Telugu OneIndia
ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో

ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో

పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామి..దీనిని బాధ్యత గా తీసుకున్నామని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటా.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ను నియంత్రించే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా వివరించారు. చెవిరెడ్డి అటు రాజకీయంగా ఇటు సామాజికంగా ప్రత్యేకతను చాటు కొనే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాల సమయంలోనూ ఏర్పాట్లు..భోజనాల ఏర్పాటు విషయంలో బాధ్యత తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో క్రియాశీలకంగా

చిత్తూరు జిల్లాలో క్రియాశీలకంగా

చెవిరెడ్డిని సీఎం అభినందించారదు. అదే విధంగా.. ముఖ్యమంత్రి నివాసం ప్రాంగణంలో..ఒక ప్రముఖ స్వామిజీ సూచన మేరకు గోవులను తీసుకొచ్చి..అక్కడ గోశాల ఏర్పాటు చేయించారు. సీఎం జగన్ - భారతి దంపతులతో గోశాలను ప్రారంభించేలా చొరవ తీసుకున్నారు. ఇప్పుడు.. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సాధించటం పైన పార్టీ నేతలు చెవిరెడ్డిని అభినందిస్తున్నారు. చంద్రగిరి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

English summary
Chevireddy Bhaskar Reddy received an award from Hyderabad-based LSF Asian Record Book Pvt Ltd for distributing 1,24,000 Vinayaka clay idols in his constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X