ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. వీడియో వైరల్!

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈయన ఒక సంచలనం. చట్టసభల్లో సీనియర్ సభ్యుడు, దెందులూరు నియోజకవర్గం టిడిపి నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ ఏం చేసినా ఆయనది ఒక స్టైల్. ఏం మాట్లాడినా ఆయనది ఒక విభిన్నమైన శైలి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న చింతమనేని వైసిపి ప్రభుత్వంతో పెద్ద ఎత్తున ఢీకొన్నారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తిన చింతమనేని
ఇక తాజాగా కూటమి ప్రభుత్వ హయాంలో దెందులూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ఇక అటువంటి చింతమనేని ప్రభాకర్ ప్రజలకు సమస్య ఉంటే వాటి పరిష్కారం కోసం ఏం చేస్తాడు? ఏం చేయగలడు? అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తారు.

MLA Chintamaneni Prabhakar turns traffic constable video goes viral

ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని
ఉదయం జోరు వాన కురుస్తున్న సమయంలో దెందులూరు మండలం సోమవరపాడు వద్ద అటుగా ప్రయాణిస్తున్న చింతమనేని ప్రభాకర్ వర్షం కారణంగా రోడ్లపైన నీరు ఆగి, మోటారు బైక్ లు, కార్లు, లారీలు అస్తవ్యస్తంగా నిలిచిపోయి అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది గమనించారు. ప్రజలు ఇబ్బంది పడడం గమనించిన ప్రభాకర్ వెంటనే తన కాన్వాయ్ ను ఆపి తానే ఒక ట్రాఫిక్ పోలీస్ గా మారి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

20 నిముషాలు ట్రాఫిక్ క్లియర్ చేసి, సమస్యను తెలుసుకుని..
ముందుగా భారీ వాహనాలను పక్కకు తప్పించి, ద్విచక్ర వాహనాలను ఒక వైపుగా పోనివ్వడం, అదేవిధంగా ఎదురుగా వచ్చే వాహనాలను క్రమబద్ధీకరిస్తూ దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ సమయాన్ని కేటాయించి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా పూర్తిగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అదేవిధంగా ఇంతలా ప్రజలు ఇబ్బంది పడడానికి కారణమైన గుంతలను సైతం తన కార్యాలయ సిబ్బంది ద్వారా ఫోటోలు తీయించారు.

నేషనల్ హైవే అధారిటీ దృష్టికి సమస్య
వాటిని ప్రాజెక్టు డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిపై ప్రజలు ఫిర్యాదు చేసే వరకు ఎదురు చూస్తూ కూర్చోకూడదని స్థానిక కూటమి నాయకులు గానీ, నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గానీ వాటిని గుర్తిస్తే సత్వరమే వాటిని పరిష్కరించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు.

ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉండరాదన్న చింతమనేని
అంతేతప్ప ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు చూద్దామనేటువంటి నిర్లక్ష్య ధోరణిని కూడా ఎవరు పాటించకూడదని అన్నారు. ప్రజలని ఇబ్బందుల పాలు చేస్తున్న గుంతల సమస్యను పరిష్కరించేలా నేషనల్ హైవే అధికారులు కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టేలా మాట్లాడతామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+