వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాంటెడ్ క్రిమినల్ సునీల్ పట్టివేత: ఇంజనీరింగ్ విద్యార్థులతో ముఠా

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: పోలీసుల కళ్లుగప్పి పరారైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎట్టకేలకు కృష్ణా జిల్లాలో పట్టుబడ్డాడు. ఇతను కడప, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు. బలవంతపు వసూళ్ల గ్యాంగ్ లీడరైన ఇతని స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇంజినీరింగ్ విద్యార్థులను చేరదీసి భారీగా డబ్బు ఆశ చూపి అనుచరులుగా మార్చుకునే వాడు. దాదాపు 170 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఇతని అనుచరులుగా ఉన్నారు. డబ్బున్న వారిని కిడ్నాప్ చేసి సొమ్ము రాబట్టడం అతని ప్రధాన వృత్తి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్‌ను గతంలో అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.

కడప సబ్‌జైలులో రిమాండ్‌లో ఉంటూ పరారయ్యాడు. ఓ కేసు విషయమై సునీల్‌ను ఈనెల 11న అనంతపురం ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్, వెంకటరమణారెడ్డి అనంతపురం కోర్టుకు తీసుకొచ్చారు. తిరిగి కడప జైలుకు తీసుకెళ్తుండగా పరారయ్యూడు. సునీల్ కదలికలు కృష్ణా జిల్లాలో ఉన్నట్లు సమాచారం రావడంతో అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌బాబు, కృష్ణా ఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా సుమారు 20 బృందాలను నియమించి జల్లెడ పట్టించారు.

MLA comes into the rescue of Maoist leader's mother

మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ నేర చరిత్ర పెద్దదే. పాశ్చాత్య దేశాల అలవాట్లను రోజురోజుకు వంటబట్టించుకుంటున్న చాలా మంది విద్యార్థులు ఆశించిన స్థాయిలోడబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సునీల్ సరిగ్గా ఇలాంటి వారిని గుర్తించి వల వేశాడు. తనతో పాటు నేరాల్లో పాలుపంచుకునేలా చేశాడు. ఇంజనీరింగ్ విద్యార్థులతో ఏర్పాటైన గ్యాంగ్ డబ్బు కోసం పలు కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడింది.

సునీల్ తండ్రి మండ్ల వెంకటరమణ 2011కు ముందు పులివెందులలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్ తండ్రి వ్యాపార కార్యకలాపాలకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. అనతి కాలంలోనే బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరప్రవృత్తికి తెర తీశాడు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో 2011లో ఎర్రచందనం అక్రమ రవాణాతో ఇతని నేరచరిత్ర ప్రారంభమైంది. తర్వాత కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు ఒడిగట్టాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజమానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వసూళ్లు కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్‌స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. సునీల్‌తో పాటు మరో నలుగురు సభ్యులను ఈ ఏడాది ఆగస్టు 11న అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.

English summary
The gang leader Sunil has been nabbed by police in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X