మిత్రపక్షాల దెబ్బకు విజయ్ 'యూ టర్న్', ఊహించని పరిణామాలు..!!
తమిళనాట రాజకీయం ఆసక్తిగా మారుతోంది. విజయ్ కు మద్దతు ఇస్తున్న పార్టీలు పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి. విజయ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను మిత్రపక్షాలు ఓపెన్ గా తప్పు బడుతున్నాయి. సరి కాదని వారిస్తున్నాయి. దీంతో.. విజయ్ వెనుకడుగు వేయక తప్పటం లేదు. తన నిర్ణయాలను మార్చుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలతో విజయ్ తన నిర్ణయం మార్పు చేస్తూ... సవరణ ఉత్తర్వులు జారీ చేసారు.
ముఖ్యమంత్రి విజయ్ కు మిత్రపక్షాలు తొలి జలక్ ఇచ్చాయి. అసెంబ్లీలో బల నిరూపణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎంగా బాద్యతలు చేపట్టిన తరువాత తన ఓఎస్డీగా తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ఓఎస్డీ గా నియమి స్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీని పైన తొలుత కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. కాగా.. ఆయనతో విజయ్ కు ఉన్న అనుబంధం పైనా చర్చ జరిగింది. రాధన్ కేవలం విజయ్ జ్యోతిష్యుడే కాదు, ఆయనకు రాజకీయ ప్రముఖులతో దశాబ్దాల అనుబంధం ఉంది.దివంగత సీఎం జయలలితకు కూడా ఈయన జ్యోతిష్యుడిగా పనిచేశారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీకి సైతం ఇష్టమైన జ్యోతిష్యుడిగా ఆయన తనను తాను అభివర్ణించుకున్నారు.విజయ్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని ఏడాది క్రితమే రాధన్ జోస్యం చెప్పారు. విజయ్ రాజకీయ అరంగేట్రం నుండి కీలక కార్యక్రమాల్లో ఆయన వెంటే ఉంటూ ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్నారు.

విమర్శలతో నియామకం రద్దు
అయితే, విజయ్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ఎక్స్ (ట్విట్టర్)లో ''నాకు అర్థం కావడం లేదు. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు అవసరం?? ఎవరైనా వివరించగలరా?' అని ఆయన ప్రశ్నించారు. ఇక అసెంబ్లీ వేదికగా హేమలతా విజయ్ కాంత్ మండిపడ్డారు. జ్యోతిష్కుడుని ఓఎస్డీగా నియిమించుకోవటం ఏంటని ప్రశ్నించారు. యువత కు ఏం సందేశం ఇస్తున్నారు.. వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన నియామకాలు ప్రభుత్వం లో చేయటం ఏంటని నిలదీసారు. ఇతర మిత్రపక్ష నేతలు ఇదే తరహాలో స్పందించారు. దీంతో.. విజయ్ తన ఓఎస్డీగా రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియామకం రద్దు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అసెంబ్లీలో ఈ నియామకం పైన పునరాలోచన చేస్తానని ఇచ్చిన హామీ మేరకు.. వెంటనే నియామక రద్దు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో.. ఇక భవిష్యత్ లో చేపట్టే నిర్ణయాల విషయంలోనూ విజయ్ తీసుకునే నిర్ణయాలు ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.













Click it and Unblock the Notifications