డ్రగ్స్ ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారంపూడి వార్నింగ్; ఇదే నా చివరి సమాధానం: నేనేం గాంధీజీని కాదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం చిలికి గాలివానగా మారుతోంది. అధికార ప్రతిపక్ష నేతలు ఏపీలో రచ్చగా మారిన డ్రగ్స్ వ్యవహారంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీలో ఇటీవల పట్టుబడిన, గుజరాత్ ముంద్రా పోర్ట్ లో దొరికిన డ్రగ్స్ వెనుక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ దందా నడిపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విదేశాలకు వెళ్లి రావడం వెనుక డ్రగ్స్ దందా ప్రధానంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమాధానం చెప్పారు.

టీడీపీ నేతల అరుపులను లెక్క చెయ్యను
డ్రగ్స్ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి అని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వైసిపి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాలకు వ్యాపారం కోసం వెళతారు కాని, డ్రగ్స్ దందా చేసేందుకు కాదని ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. డ్రగ్స్ దిగుమతిలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందని టిడిపి నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పు పట్టారు. తప్పుడు కథనాలకు భయపడబోమని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతల అరుపును లెక్కచేయని ఆయన స్పష్టం చేశారు.

పెద్ద మొత్తంలో డ్రగ్స్ రవాణా .. టీడీపీ అల్లిన ఓ కట్టుకథ
మాదక ద్రవ్యాల రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది అని, కేవలం మూడు నెలల వ్యవధిలో 23 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నామని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. టిడిపి నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఓ కట్టుకథ అల్లారని, అందులో నన్ను మరో ఇద్దరు ప్రముఖ వ్యాపారులను తీసుకొచ్చి లింకు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. డబ్బు సంపాదించడం కోసం ఎంతోమంది విదేశాలకు వెళుతున్నారని, దానిని కూడా ప్రశ్నిస్తే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇదే నా చివరి సమాధానం ..నేనేం గాంధీజీని కాదు
అక్కడికి ఎందుకు వెళ్లారు ?ఇక్కడికి ఎందుకు వెళ్లారు? అంటూ అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ద్వారంపూడి ఇలాంటి వాటికి మరోసారి తాను సమాధానం చెప్పనంటూ, ఇదే నా చివరి సమాధానం అంటూ పేర్కొన్నారు. మరోసారి ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని సరైన రీతిలో బుద్ధి చెబుతానంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఉండటం కోసం నేను గాంధీజీ ని కాదని మండిపడ్డారు.
Recommended Video

నాడు పట్టాభికి జిల్లా ఆఫీస్ లో పట్టిన గతే పడుతుంది ..ద్వారంపూడి వార్నింగ్
తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తే టీడీపీ జిల్లా కార్యాలయంలో పట్టాభి కి జరిగినట్టే జరుగుతుందంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. సీఎం జగన్ ను విమర్శించే అవకాశాల్లేక చంద్రబాబు అండ్ గ్యాంగ్ చేస్తున్న కుట్రలో ఇదంతా భాగమని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న కాకినాడను డ్రగ్స్ కి లింక్ చేస్తూ టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మొత్తానికి ఏపీలో నువ్వా నేనా అన్నట్టు ఒకరిపై ఒకరు డ్రగ్స్ వ్యవహారంలో చేసుకుంటున్న ఆరోపణలు, విసరుకుంటున్న సవాళ్ళు, ఇస్తున్న వార్నింగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications