సీఎం జగన్ కు కోటంరెడ్డి అభినందనలు - విజయం సాధించాం..!!
ముఖ్యమంత్రి జగన్..ఏపీ ప్రభుత్వానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అభియోగాలతో పార్టీ నుంచి కోటంరెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేల ను సస్పెండ్ చేసారు. ప్రభుత్వం పైన కోటంరెడ్డి విమర్శించిన అంశాల్లో ఒకటైన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల పనులకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాను గతంలో ఆరు నెలల పాటు ఈ నిధుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగానని..ఇప్పుడు జీవో విడుదల చేసారని చెబుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
బరాషాహిద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం కోసం 9 నెలలు అయినా ఆర్ధిక శాఖ అనుమతులు లేవని నిలిపేశారని... 6 నెలల పాటు ప్రభుత్వం పెద్దల చుట్టు తిరిగినట్లు తెలిపారు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదన్నారు. వారం రోజుల నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టామని.. తమ ప్రయత్నంతో విజయం సాధించామన్నారు. రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు. ఇది తన విజయం కాదని నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

అధికార పక్షమా, ప్రతిపక్షమా అనికాదు సంకల్పం ఉంటే ఏదైన సాధ్యం అవుతుందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పొట్టేపాలెం కలుజు పై కూడా స్పందించాలని అభ్యర్దించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జగనన్న కాలనీలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు. గణేష్ ఘాట్ నిర్మాణం కోసం కేంద్ర ఇచ్చిన రూ.16 కోట్ల నిధులు వెనక్కిపోకుండా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ మాత్రమే జెండా.. అజెండాలు.ఎం మిగిలిన సమయంలో ప్రజా సమస్యలేనని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. నెల్లూరు రూరల్ సమస్యల పై రేపటి నుండి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు కోటంరెడ్డి ప్రకటించారు.













Click it and Unblock the Notifications