నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సజ్జలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి ప్రభుత్వ సలహాదారు సజ్జల ను టార్గెట్ చేసారు.

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి ప్రభుత్వ సలహాదారు సజ్జల ను టార్గెట్ చేసారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. తనను ఒక్కడిని చేసి వైసీపీ నేతలంతా మాటల దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను సీఎం జగన్ కు నమ్మక ద్రోహం చేసి ఉంటే తనను నాశనం చేయమని దేవుడిని వేడుకుంటానని చెప్పారు. తాను అధికారం వదులుకొని వచ్చానని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబును కలిసి ఉంటే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తన మీద కోపం ఉంటే తన గురించి మాట్లాడాలని..పిల్లల గురించి ప్రస్తావన చేయవద్దని కోరారు.

నేను మోసం చేయలేదు...

నేను మోసం చేయలేదు...


తాను ఆఖరి దాకా ఉండి నామినేషన్ల సమయంలో మోసం చేయలేదని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. నెల రోజుల క్రితం వరకు తనకు ఎటువంటి ఆలోచనలు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారం దొరికిన తరువాత మాత్రమే తాను తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చానని చెప్పారు. తాను 35 ఏళ్ల ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేసారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తాను ప్రేమించిన వారే తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ చేయటంతో తన మనసు విరిగిందన్నారు. అవమానించిన చోట ఉండకూడదనే తాను అధికారం వదులుకోవటానికి సిద్దమయ్యానని వివరించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని ఆరోపించారు.

సజ్జల పైన కోటంరెడ్డి కామెంట్స్..

సజ్జల పైన కోటంరెడ్డి కామెంట్స్..


ప్రభుత్వ సలహాదారు సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే మేధస్సు ఉందని ఎద్దేవా చేసారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఇసుక..మద్యం వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో వారి పైన ట్యాపింగ్ చేయించాలని డిమాండ్ చేసారు. వైసీపీ ప్రభుత్వంలో థియేటర్లు నడపలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇసుక, మద్యం పేరుతో ఎవరు దోచుకుంటున్నారో..ఆ డబ్బులు ఎక్కడకు పోతున్నాయో ఆడియోలు పెట్టించాలని కోటంరెడ్డి సవాల్ విసిరారు. ట్యాపింగ్‌పై విచారణ జరపకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఇసుక మాఫియా ఎవరినీ ఖాతరు చేయడం లేదన్నారు.

ఎన్ కౌంటర్ చేస్తేనే నా వాయిస్ ఆగేది..

ఎన్ కౌంటర్ చేస్తేనే నా వాయిస్ ఆగేది..


తనను అరెస్ట్ చేస్తామని సజ్జల ఆధ్వర్యంలో మీడియాకు లీకులు ఇస్తున్నారని..ఎప్పుడెైనా అరెస్ట్ చేసుకోవచ్చని కోటంరెడ్డి పేర్కొన్నారు. జైళ్లు రాజకీయ నేతలకు అచ్చి వస్తాయన్నారు. ఎన్ కౌంటర్ చేస్తే మినహా.. ఎన్ని కేసులు పెట్టినా తన గొంతు ఆగదని కోటంరెడ్డి స్పష్టం చేసారు. నెల రోజుల పాటు రాజకీయాలు మాట్లాడనని...రూరల్ ఇంచార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డికి నియోకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు. ఎన్నికల సమయంలోనే ఎవరు ఏంటనేది తేలుతుందన్నారు. ఎన్నికలప్పుడు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని..ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కాలమే నిర్ణయిస్తుందని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. తనతో నిలిచే కార్యకార్తలతో ఆత్మీయ సమావేశాలు ఉంటాయని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

English summary
Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy sesnational allegations against Sajjala Ramakrishna Reddy. Says he is ready for Arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X