రాజకీయ భవిష్యత్ - లక్ష్యంపై ఎమ్మెల్యే వసంత కీలక ప్రకటన..!!
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేసారు. తన రాజకీయ భవిష్యత్..లక్ష్యం పైన క్లారిటీ ఇచ్చారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేసారు. తన రాజకీయ భవిష్యత్..లక్ష్యం పైన క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వసంత పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మంత్రి జోగి రమేష్ మైలవరం లో జోక్యం చేుకోవటం పైన ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన ఎమ్మెల్యే వసంత సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న సమస్య లను వివరించారు. ఈ సమమయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. దీంతో..తన రూటు..లక్ష్యం ఏంటనేది ఎమ్మెల్యే వసంత ప్రకటించారు.

సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టారు..
తమ కుటుంబం 55 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉందని ఎమ్మెల్యే వసంత చెప్పుకొచ్చారు. తాను నందిగామ నియోజకవర్గంలో ఉంటూ..మైలవరం కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. కానీ, ఏ నాడు నందిగామ నియోకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. అదే విధంగా జోగి రమేష్ పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని వివరించారు. ఇదే అంశం పైన తాను జోగి రమేష్ తో చర్చించానని ..ఆ సమయంలో తాను జోగి రమేష్ తో మీ లక్ష్యం మేరకు మీరు మంత్రి అయ్యారని..నా లక్ష్యం మేరకు నేను పని చేసుకుంటానని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. పార్టీలో సొంత నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమని చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే గడప గడపకు ప్రభుత్వం నిర్వహణలో దూరంగా ఉన్నానని వివరించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి తో సమావేశమై అన్ని అంశాల పైన ఓపెన్ గా చెప్పానని..ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేసారు.

జగన్ ను సీఎం కావాలి.. దేవినేని ఉమా ఓడాలి
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేసారు. ఎప్పిటీకీ వైఎస్ కుటుంబంతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రితో కలిసిన సమయంలో తన నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోరనే అంశం పైన స్పష్టమైన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఏదైనా సమస్యలు ఉంటే సీఎంఓతో మాట్లాడాలని సీఎం సూచించినట్లుగా చెప్పుకొచ్చారు. సీఎంతో జరిగిన భేటీలో అన్ని అంశాలను వెల్లడించినట్లుగా చెప్పుకొచ్చారు. వసంత రాజకీయాల పైన ఆనాసక్తి వ్యక్తం చేయగా.. మరో 25 ఏళ్లు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పటంతో వసంత అంగీకరించారు. ఇక తన లక్ష్యంగా మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అవ్వటం..అదే విధంగా దేవినేని ఉమాను ఓడించటం తన లక్ష్యంగా స్పష్టం చేసారు. దేవినేని ఉమా లాంటి వారిని నమ్ముకుంటే చంద్రబాబు ఇప్పుడు వచ్చిన 23 సీట్ల కంటే మరింతగా తగ్గిపోతారని వసంత చెప్పుకొచ్చారు.

మైలవరం పై హైకమాండ్ నిఘా ఉంది
మైలవరం నియోజకవర్గం పైన హైకమాండ్ కన్నేసిందని వసంత చెప్పారు. పార్టీ ఇంఛార్జ్ లు..పరిశీలకులతో పాటుగా ఐ ప్యాక్ టీం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారని.. పూర్తి సమాచారం సేకరించి సీఎంఓకు నివేదిస్తున్నారని వసంత వివరించారు. దేవినేని ఉమా గురించి ఎంతో మంది తనకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమా అసెంబ్లీ గేటు తాకటానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. తాను వ్యాపారం - రాజకీయం ఒక స్పష్టతతో చేస్తానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత తనకు పూర్తి నమ్మకం ఏర్పడిందని..నియోజకవర్గంలో తిరిగి గడప గడపకు కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తున్నట్లు వసంత ప్రకటించారు. ఇక నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి సమస్యలు ఉండవని ధీమా వ్యక్తం చేసారు. సీఎం నేరుగా జోక్యం చేసుకోవటంతో మైలవరం పంచాయితీలో వైసీపీ సమిసిపోయింది.












Click it and Unblock the Notifications