బావ బాలయ్యకు డబుల్ ధమాకా ఇచ్చిన సీఎం, హీరో ఫ్యాన్స్, టీడీపీ క్యాడర్ హ్యాపీ

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి టీడీపీ సర్వం సిద్దం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన సొంత నియోజకవర్గంలో రెండు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి, చిన్న మార్కెట్ ప్రాంతంల్లో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఈనెల 16వ తేదీ శుక్రవారం ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండు అన్న కాంటీన్లు ప్రారంభించనున్నారు. హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్ కు హిందూపురం పరిసర ప్రాంతాల నుండి ప్రతిరోజు పెద్ద సంఖ్యలు ప్రజలు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

MLA Nandamuri Balakrishna is opening two Anna canteens in Hindupuram

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఆ ప్రాంతంలో అన్న కాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారం నిమిత్తం వచ్చే రైతులు, వ్యాపారుల కోసం హిందూపురంలోని చిన్న మార్కెట్ ప్రాంతంలో అన్న కాంటీన్ ప్రారంభిస్తున్నారు. హిందూపురంలో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ఆ ప్రాంతంలోని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హిందూపురంలోని రెండు అన్న క్యాంటీన్లలో ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్లు రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి.

MLA Nandamuri Balakrishna is opening two Anna canteens in Hindupuram

ఐదు రూపాయలకే టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 12:30 గంటల నుండి మూడు గంటల వరకు భోజనం, రాత్రి 7:30 గంటల నుండి 9 గంటల వరకు భోజనం పేదలకు అందిస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. మొత్తం మీద హిందూపురంలో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభం కావడంతో హీరో బాలయ్య అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+