పుష్ఫశ్రీవాణి నమ్మకం ఏంటి - జగన్ కు ఎలక్షన్ గిఫ్ట్..!!
ఏపీలో ఎన్నికల్లో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. వైసీపీ - కూటమి మధ్య కీలక నియోజకవర్గాల్లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. జగన్ వై నాట్ 175 అంటూ ప్రతీ చోట గెలవాలని నిర్దేశించారు. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. తాను అమలు చేస్తున్న సంక్షేమం, సామాజిక న్యాయం తనకు అధికారం అప్పగిస్తాయనేది జగన్ నమ్మకం. అందులో భాగంగా కురుపాం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి ఈ సారి గెలుపు మాత్రమే అంతుకు మంచి అంటూ సవాల్ చేస్తున్నారు.
గురి పెట్టిన జగన్ : సీఎం జగన్ ఈ సారి ఎస్సీ, ఎస్టీ నియోజకర్గాలను మరోసారి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క కొండెపి మినహా అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను గెలుచుకున్నారు. ఎస్టీ వర్గం నుంచి జగన్ తన తొలి కేబినెట్ లో పుష్ఫశ్రీవాణికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2014, 2019 ఎన్నికల్లో పుష్పశ్రీవాణి రెండు సార్లు గెలిచి నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకున్నారు. ఈ సారి హ్యాట్రిక్ తో పాటుగా నియోజకవర్గంతో రికార్డు మెజార్టీ సాధించాలని టార్గెట్ గా డిసైడ్ అయ్యారు. సీఎం జగన్ తన మీద ఉంచిన నమ్మకానికి భారీ మెజార్టీతో గెలిచి గిఫ్ఠ్ గా ఇస్తానని ధీమాగా చెబుతున్నారు. కురుపాంలో పుష్ఫశ్రీవాణికి పూర్తి సానుకూలత కనిపిస్తోంది.

హ్యాట్రిక్ దిశగా : కురుపాం నుంచి టీడీపీ అభ్యర్దిగా టీ జగదీశ్వరిని ఖరారు చేసారు. కురుపాంలో ఉన్న రాజకీయ సమీకరణాల్లో భర్త పరీక్షిత్ రాజు సహకారంతో పుష్ఫశ్రీవాణి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి పరీక్షిత్ రాజ్ ఆయనతోనే ఉన్నారు. పరీక్షిత్ రాజుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. 2014లో తొలిసారి పోటీ చేసిన పుష్ఫశ్రీవాణి టీడీపీ అభ్యర్ది జనార్ధన్ తాట్రాజ్ పైన 19,083 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో మరోసారి అదే అభ్యర్ది పైన 26,602 ఓట్లతో గెలుపొంది డిప్యూటీ సీఎం అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించారు. మరింత గిరి పుత్రులకు దగ్గరయ్యారు. పలు పథకాలు, కీలక నిర్ణయాలు అమలు చేసారు. ఇప్పుడు 2019 కంటే భారీ మోజార్టీతో గెలిచేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా ప్రతీ ఇంటితోనూ ఈ పదేళ్ల కాలంలో మమేకం అయ్యారు.

అసలు టార్గెట్ ఇదే : పరీక్షిత్ రాజు అటు పార్టీ అప్పగించిన కార్యక్రమాలతో పాటుగా నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. జగన్‌కు నమ్మిన బంటుగా నిలిచిన పరీక్షిత్ కు పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించడం జరిగింది . ఎస్టీల కోసం ఈ అయిదేళ్ల కాలంలో జగన్ అమలు చేసిన నిర్ణయాలు, ప్రతీ ఇంటికి చేసిన మంచి తమకు సహకరిస్తుందని పుష్పశ్రీవాణి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి గడప ద్వారా ప్రతీ ఇంటికి చేరువయ్యారు. స్థానికంగా ఓటర్లతో మమేకం అవుతూ అవసరమైన సమయంలో అండగా నిలుస్తారనే గుర్తింపు ఉంది. సర్వే సంస్థలు సైతం ఏకపక్షంగా పుష్పశ్రీవాణికి అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. దీంతో, గెలుపు ఇప్పటికే ఖాయమైనా రికార్డు మెజార్టీనే లక్ష్యంగా పుష్పశ్రీవాణి అడుగులు వేస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications