ఆ నిర్ణయం నచ్చలేదు.. బాబు నుంచి భరోసా వచ్చింది గనుకే: టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే రాజేశ్వరి

Subscribe to Oneindia Telugu
  జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ టీడీపీలోకి నెక్స్ట్ ఏంటి జగన్ ? | Oneindia Telugu

  విజయవాడ: కార్యకర్తలతో చర్చించాకే వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్ తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చలేదని అన్నారు.

  జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ డౌన్.. టీడీపీలోకి ఎమ్మెల్యే రాజేశ్వరి, డైరెక్షన్ జ్యోతులదే!

  శనివారం ఉదయం టీడీపీలో చేరిక అనంతరం ఆమె మాట్లాడారు. పార్టీ వీడటంపై స్పందిస్తూ.. తన నియోజకవర్గంలో ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారంతా తనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ జగన్, తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా.. అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు.

  mla rajeswari says jagan's assembly boycott decision was not good

  ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర సమమే మిగిలి ఉన్న తరుణంలో.. అసెంబ్లీని బహిష్కరిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్దిపై చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తానని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  MLA Vantala Rajeswari joined in TDP, She criticized Jagan over the issue of assembly boycott

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి