అసలు ఆర్థిక నేరస్తులు చంద్రబాబు,లోకేషే...జగన్ కాదు:రోజా
మొన్నటిదాకా జగన్ ఆర్థిక నేరస్తుడు అని ఊదరగొట్టిన చంద్రబాబు, లోకేష్ బండారం అసలు బండారం ఇప్పుడు బైటపడిందని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అసలైన ఆర్థిక నేరస్తులు చంద్రబాబు,లోకేష్ లేనని...జగన్ కాదని ఆమె అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు
బిజెపితో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారంటూ టిడిపి చేస్తున్న విమర్శలను రోజా తిప్పికొట్టారు. జగన్ నిజంగానే మోదీతో జతకడితే...కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తామని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు మంచోడు అన్నారని...ఇప్పుడు ఆయనే టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి చెడ్డ వ్యక్తి అయిపోయారా?...అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications