రావెల సుశీల్ చేయిపట్టి లాగాడుగా, మార్షల్స్ నాపై కూర్చున్నారు, నన్ను ఉరి తీస్తారా: రోజా
హైదరాబాద్: హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ తనను సభకు రానివ్వకపోవడం సరికాదని, రావెల సుశీల్ యువతి చేయి లాగాడని, అతని తండ్రి రావెల కిషోర్ బాబు మంత్రి పదవికి అర్హుడా అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. చీఫ్ మార్షల్ టిడిపి కార్యకర్తలా పని ఆరోపించారు. గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చాక రోజా మాట్లాడారు.
ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఓ బ్లాక్ డేగా పరిగణిస్తున్నామన్నారు. మనమంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, న్యాయవ్యవస్థను గౌరవిస్తామన్నారు. మనకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తామని, కానీ ఈ రోజు ఏపీ అసెంబ్లీ తీరు న్యాయవ్యవస్థను ధిక్కరించే విధంగా ఉందన్నారు.
కోర్టు తనకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇచ్చిందని, కానీ ప్రభుత్వం తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సమయంలో మార్షల్స్ తన పైన కూర్చున్నారని, తాను స్పృహ కోల్పోయానని, దీంతో తనను ఆసుపత్రికి తీసుకు వెళ్లానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె చీఫ్ మార్షల్ గణేష్ పేరును ప్రస్తావించారు. గణేష్ టిడిపి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ చెప్పింది మేం వినమన్నట్లుగా ఇప్పుడు టిడిపి వ్యవహరిస్తుందని, మరి అలాంటప్పుడు కేసులో వాదించేందుకు లాయర్లను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
వీరి మాటేమిటి
తాగి చిట్టకార్తి కుక్కలా అమ్మాయి చేయి లాగి, బలాత్కరించబోయిన రావెల సుశీల్ తండ్రి రావెల కిషోర్ బాబు మంత్రిగా అర్హుడా అని ప్రశ్నించారు. వనజాక్షిని కొట్టిన టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దానికి అర్హుడా అని మండిపడ్డారు. మండలిలో బుద్ధా వెంకన్న తదితరులు సభలో కూర్చునేందుకు అర్హులా అని ప్రశ్నించారు.
బోండా సిద్ధార్థ ఒకరిని చంపేశాడని, అలాంటి సిద్ధార్థ తండ్రి బోండ ఉమ, ఎమ్మెల్యే వంగలపూడి అని, పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సభలో కూర్చునేందుకు అర్హులా అని రోజా ప్రశ్నించారు. ఇది నీతిమాలిన రాజకీయం అన్నారు.
మహిళల సమస్యలపై పోరాడుతున్న తనను అసెంబ్లీకి రానివ్వక పోవడం విడ్డూరమన్నారు. ఇదంతా టిడిపి రౌడీ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఇలాంటి వారిని గెలిపించడం వల్ల మాకు, మీకు రక్షణ లేకుండా పోయిందని రోజా ప్రజలకు చెప్పారు. నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

ఉరి తీస్తారా?
నేను 1999లో రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి మహిళల కోసం, ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు. స్పీకర్, హౌస్ సుప్రీం అంటే.. రోజాను ఉరి తీయండి అంటారు.. అప్పుడు తనను ఉరి తీస్తారా అని నిలదీసారు. అసెంబ్లీ రూల్స్‌ను అధికార పార్టీయే గౌరవించడం లేదన్నారు.
నేను చేయని తప్పుకు ఇప్పటికే శిక్షను అనుభవించానని చెప్పారు. తాను ప్రజల కోసం పోరాడుతున్నాను కాబట్టి తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేవినేని ఉమ, బోండ ఉమ, పీతల సుజాత, గోరంట్ల.. సాక్షాత్తు చంద్రబాబు అన్ పార్లమెంటరీ పదాలు వాడారన్నారు.
మనకు అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్తామని, కానీ ఇప్పుడు న్యాయస్థానం తీర్పును కూడా టిడిపి గౌరవించడం లేదన్నారు. వీరికి న్యాయస్థానం పైన, ప్రతిపక్షం పైన గౌరవం లేదన్నారు. నియంతృత్వంగా వెళ్తున్నారన్నారు. వీరు మట్టిలో కలిసిపోయే రోజు వస్తుందన్నారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే పరిస్థితి లేదన్నారు. నేను మేకప్ వేసుకోకుండా, గొడుకు పట్టుకోకుండా రోడ్ల పైన కూర్చున్నానని చెప్పారు. తనకు బ్లీడింగ్ అయిన సమయంలోను రోడ్డెక్కానని, ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు.
రోజా ఇంకా నటిగా వ్యవహరిస్తున్నారు: టిడిపి ఎమ్మెల్యే శ్రవణ్
వైసిపి ఎమ్మెల్యే రోజా ఇంకా నటిగానే వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే శ్రవణ్ ధ్వజమెత్తారు. ఆమె ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. రోజా సస్పెన్షన్ సభాపతి నిర్ణయం కాదని, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. రోజా ప్రవర్తన అసెంబ్లీలో చాలా దారుణంగా ఉందని చెప్పారు. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశం కాదని, వ్యవస్థకు సంబంధించిన అంశంగా భావిస్తున్నట్లు చెప్పారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications