కబడ్డీ ఆడిన రోజా: తిరుపతిలో సందడిగా జాతీయస్థాయి కబడ్డీ పోటీలు; నగరి ఎమ్మెల్యే ఆటతో క్రీడాకారుల్లో జోష్
నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి నియోజకవర్గంలో తనదైన శైలిలో దూకుడు చూపిస్తున్నారు. ఆమె ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి. లాక్ డౌన్ సమయం లో కరోనా మహమ్మారి కట్టడికి విధులు నిర్వర్తించిన వారికి స్వయంగా వంట చేసి పెట్టిన రోజా , అప్పట్లో అంబులెన్సు నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత దిశ స్కూటర్లను నడిపి సందడి చేశారు. గతంలో డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ ఎమ్మెల్యే రోజా అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆటలు అంటే ఎనలేని మక్కువ చూపించే రోజా కబడ్డీ, వాలీబాల్ షటిల్ ఇలా ఏ ఆట అయినా సరే అదరగొట్టేస్తారు. హుషారుగా ఆడుతూ అందరిలో జోష్ నింపుతారు ఎమ్మెల్యే రోజా.

తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కబడ్డీ ఆడిన రోజా
ఇక తాజాగా తిరుపతిలో జరుగుతున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వారితో ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలనుతిరుపతిలో నిర్వహించటం గర్వకారణమని రోజా క్రీడలతో ఆనందం దక్కుతుందని, ఆరోగ్యంగా ఉంటామని వెల్లడించారు. కాసేపు కబడ్డీ ప్లేయర్ గా మారిపోయిన రోజా మేయర్ శిరీష, కమిషనర్ గిరీశ లతో కబడ్డీ ఆటలో తలపడ్డారు. క్రీడాకారులకు గట్టిపోటీ ఇస్తూ ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడారు. రోజా ఆటతీరుకు క్రీడాకారులు కూడా ఫిదా అయిపోయారు.

రోజాతో పాటు కబడ్డీ కోర్టులోకి దిగిన తిరుపతి మేయర్, కమీషనర్
రోజా తో పాటు తిరుపతి మేయర్ పలువురు మహిళా నేతలు కూడా కోర్టులో దిగి కబడ్డీ ఆడటం అక్కడ ఉన్న వారందరిలో జోష్ నింపింది. రోజా కోర్టులోకి కబడ్డీ కబడ్డీ అంటూ కూత పెట్టడంతో ఒక్కసారిగా స్టేడియం అంతా దద్దరిల్లింది. స్టేడియం లో ఉన్న ప్రేక్షకులందరూ కరతాళధ్వనులతో ఎమ్మెల్యే రోజా ఆటను ఆస్వాదించారు. జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను వీక్షించిన రోజా కబడ్డీ వాలీబాల్ లాంటి ఆటల పోటీలు జరగడం సంతోషంగా ఉందని, తాను ఎప్పుడైనా సరే క్రీడాకారులను ప్రోత్సహిస్తానని ఎమ్మెల్యే రోజా చెప్పారు.

కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రోజా తదితరులు
ఇదిలా ఉంటే రోజా తో పాటు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష తదితరులు ఆసక్తికరంగా తిలకించారు. దేశవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమని ఆధ్యాత్మిక క్షేత్రానికి క్రీడలతో కొత్త కళ వచ్చిందని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో రోజా ఆట ప్రధాన ఆకర్షణ
జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించటం గర్వకారణమని క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తిరుపతి జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. కబడ్డీ పోటీలతో తిరుపతిలో పండుగ వాతావరణం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
గతంలోను రోజా నగరి నియోజకవర్గం లో గ్రామీణ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించారు. భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ కబడ్డీ అంటూ కాసేపు కబడ్డీ కోర్టులో కబడ్డీ ప్లేయర్ గా మారిపోయిన రోజా సరదాగా కబడ్డీ ఆడారు. ఇప్పుడు మరోమారు ఉత్సాహంగా కబడ్డీ ఆడి అందరిలో ఉత్సాహం నింపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications