రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడి దుర్మరణం

శ్రీనివాస్ మాత్రం తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్పోర్ట్‌స బైక్‌పై బయల్దేరి వస్తుండగా పాలకొండ పోలీసు స్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలకొండలోని పలు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు శ్రీనివాస్ నాటుబండిని ఢీకొన్నట్లు తెలిపారు. తన ఒక్కగానొక్క కుమారుడు ఇలా మృతి చెందడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
రాత్రి సమయం కావడంతో చలి బాగా వేస్తుంది కారులో వచ్చేయమన్నానని, బైక్‌పైనే జాగ్రత్తగా వచ్చేస్తానని, మీకంటే ముందు ఇంటికి చేరుకొని అక్కడ ఉంటానని చెప్పాడంటూ ఎమ్మెల్యే సుగ్రీవులుతోపాటు కుటుంబ సభ్యులు విలపించారు. శ్రీనివాస్ బిటెక్ చదువు తున్నాడు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుగ్రీవులుకు ఫోన్ చేసి పరామర్శించి నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసు పత్రికి తరలించారు. కేసును పాలకొండ సీఐ విజయానంద్, ఎస్‌ఐ వినోద్‌బాబు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications