Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లోకేష్.. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సవాల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. ఆదోని ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడినట్టు లోకేష్ పేర్కొన్నారు.

ఆదోని నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, సాయి ప్రసాద్ రెడ్డి తో పాటు, ఆయన భార్య, ఆయన కుమారుడు మనోజ్ రెడ్డి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై లోకేష్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.

 mlasaiprasadreddy-

లోకేష్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్న ఆయన, కిరాయి గుండాలని పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు. తాను భూకబ్జాలకు పాల్పడుతున్నానని చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతానంటూ సవాల్ విసిరారు. ఇక తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుందా చెప్పాలంటూ ప్రశ్నించారు.

పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ పిచ్చి కూతలు కూస్తూ ఊరూరూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నారా లోకేష్ ఒక సైకో అంటూ మండిపడ్డారు.

 mlasaiprasadreddy-

భూకబ్జాలు చేసే అలవాటు నారా వారికే చెల్లు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అర్హత లేకపోయినా ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+