Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ కార్యకలాపాలపై ప్రభుత్వం కఠిన ఆంక్షల కొరడా..!!

రాయచోటి: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం జీఓ నంబర్ 1 చుట్టే తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు-జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో భేటీకి దారి తీసింది ఇదే జీఓ. రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవలే జారీ చేసిన ఈ ఆదేశాలు రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమౌతోంది. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికీ కారణమౌతోంది.

చంద్రబాబు సభల్లో తొక్కిసలాటతో..

చంద్రబాబు సభల్లో తొక్కిసలాటతో..

డిసెంబర్ 28వ తేదీన నెల్లూరు జిల్లా కందుకూరులో, జనవరి 1వ తేదీన గుంటూరుల్లో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో- అలాంటి విషాదకర ఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ అది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అవి.

వైసీపీయేతర పార్టీలన్నీ..

వైసీపీయేతర పార్టీలన్నీ..

దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నాయి ప్రతిపక్షాలన్నీ. జీఓను జారీ చేయడానికి గల కారణాలను ఏ మాత్రం పట్టించుకోవట్లేదనేది ఇక్కడ స్పష్టమౌతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనత పార్టీ, వామపక్షాలు.. ఈ జీఓను తీసుకుని రావడాన్ని తప్పు పడుతున్నాయే తప్ప అందుకు దారి తీసిన ఉదంతాలపై దృష్టి సారించట్లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు వాదిస్తోన్నారు.

ప్రతిపక్షాలన్నీ..

ప్రతిపక్షాలన్నీ..

ఇందులో పొందుపరిచిన నిబంధనలు, మార్గదర్శకాలు తమ పార్టీకి కూడా వర్తిస్తాయని, బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించాలంటే తాము కూడా పోలీసుల నుంచి అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోన్నాయి. కారణాలే ఏమైనప్పటికీ- జీఓ నంబర్ 1ను కేంద్రబిందువుగా చేసుకుని ప్రతిపక్షాలన్నీ ఏకమౌతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గడప గడపకూ..

గడప గడపకూ..

కాగా- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తోండటం చర్చనీయాంశమైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి కావాలని కోరుతూ చట్టసభల సమన్వయకర్త, వైఎస్ఆర్సీపీకి చెందిన రాయచోటి శాసన సభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు లేఖ రాశారు.

డీఎస్పీకి లేఖ..

డీఎస్పీకి లేఖ..

తన నియోజకవర్గం పరిధిలోని లక్కిరెడ్డిపల్లి, దప్పేపల్లి, కోనంపేట గ్రామాల్లో గడప గడపకు.. కార్యక్రమాన్ని చేపట్టారాయన. మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దీన్ని నిర్వహించడానికి అనుమతి కోరారు. ఈ మేరకు జీ శ్రీకాంత్ రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి నిస్సార్ అహ్మద్.. రాయచోటి డీఎస్పీకి లేఖ రాశారు.

చట్టం అందరికీ సమానమే..

చట్టం అందరికీ సమానమే..

స్థానిక ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 1 అమలులో ఉన్న కారణంగా అనుమతిని తీసుకుంటున్నామని, చట్టం అందరికీ సమానమేనని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+