చంద్రబాబును చెండాడిన శ్రీకాంత్ రెడ్డి : 'టిష్యూ పేపర్ పై ప్లాన్స్' అంటూ ఫైర్

Subscribe to Oneindia Telugu

విజయవాడ : పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు పోకడలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై తాజాగా స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారానికి తెరలేపుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబు చెబుతున్న పెట్టుబడుల లెక్కలను ప్రస్తావిస్తూ.. పదేళ్ల కాలానికి గాను దేశం మొత్తానికి లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఒక్క ఏపీకి మాత్రమే చైనా నుంచి 50 వేల కోట్లు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు శ్రీకాంత్ రెడ్డి. తమ దేశాల్లోనే పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోన్న తజికిస్తాన్, కజికిస్తాన్ వంటి దేశాలను పెట్టుబడులు పెట్టాలంటూ చంద్రబాబు సంప్రదించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

కజికిస్తాన్ లాంటి దేశాలను పెట్టుబడుల కోసం ప్రాధేయపడుతూ చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. కజికిస్తాన్ లో ఓ చిన్నపాటి హోటల్ లో దిగిన చంద్రబాబు అక్కడివాళ్లిచ్చే టిష్యూ పేపర్ల మీద పెట్టుబడుల ప్లాన్స్ గీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

MLA Srikanth Reddy suspects Chandrababu foreign tours

చంద్రబాబు విదేశీ పర్యటనలపై అనుమానం వ్యక్తం చేస్తూ.. విదేశాల్లో చంద్రబాబు టూర్స్ మీద విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైనాలో ఓ బుల్లెట్ ట్రైన్ పక్కన నిలబడి అమరావతికి బుల్లెట్ ట్రైన్ వచ్చేసినట్టే అని చంద్రబాబు చేస్తోన్న ప్రచారాన్ని ఏవిధంగా చూడాలో అర్థం కావడం లేదన్న ఆయన, అమరావతికి బుల్లెట్ ట్రైన్ ను ఎలా తీసుకొస్తారో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. రైల్వే వ్యవహారాలను కేంద్రం, రైల్వే శాఖ పర్యవేక్షిస్తాయన్న కనీస అవగాహన కూడా చంద్రబాబుకు లేదా..? అని ప్రశ్నించారాయన.

ఇకపోతే రాష్ట్రంలోనే ఉన్న ప్రముఖ కంపెనీలు జీవీకే, జీఎంఆర్, హెటిరో, రాంకో వంటి సంస్థలకు మరిన్ని పెట్టుబడులకు అవకాశం కల్పించకుండా, కేవలం తెల్లవాళ్లు, పిల్లికళ్లు ఉన్నవాళ్లకే పెట్టుబడులకు అవకాశం ఇస్తామన్న తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో బందరు పోర్టుకు కేవలం రెండు వేల ఎకరాలు సరిపోతాయన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేవలం తన సన్నిహితులకు భూములు కట్టబెట్టేందుకే రెండు వేల ఎకరాలను కాస్త లక్ష ఎకరాలకు పెంచి, భూసేకరణకు సిద్దపడడం ఆక్షేపనీయమని ఆరోపించారు శ్రీకాంత్ రెడ్డి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Srikanth Reddy fires on CM Chandrababu Naidu. He made some allegations on Chandrababu naidu and he demanded central govt to invistigate on CM foreign tours for investments

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి