మహిళను వివస్త్రగా మార్చి చెప్పులతో దాడి!!

Subscribe to Oneindia Telugu

కదిరి : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అనుచరులు దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలుండగా.. తాజాగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అనుచరుడు ఒకరు ఓ మహిళపై దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

రేషన్ నారాయణ అనే చాంద్ బాషా అనుచరుడు ఓ మహిళను వివస్త్రను చేసి ఆమెపై చెప్పులతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాష్టికాన్ని తట్టుకోలేక బాధిత మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం వెలుగుచూసినట్టుగా సమాచారం. నారాయణ దాడిని తట్టుకోలేకనే మహిళ ఆత్మహత్యయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Mla supporter brutally attacked a woman in anantapur

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a allegation on Kadiri MLA chandbashas follower ration Narayana that he attacked a woman brutally in Anantapur
Please Wait while comments are loading...