వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఆర్డీఏకు కొత్త అర్ధం చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి; అది వింటే షాక్ అవ్వటం ఖాయం!!

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతిపై వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సిఆర్డిఏ కు ఎమ్మెల్యే శ్రీదేవి సరికొత్త భాష్యం చెప్పారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అంటూ ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కోసం రైతులతో తిట్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తుళ్లూరులో రైతులను బెదిరించి 52 వేల ఎకరాలు లాక్కున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. భూములు లేని వారికి సీఆర్డీఏ ద్వారా 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనుకుంటే కోర్టుకు వెళ్లారని టీడీపీపై ఆమె ఆరోపణలు చేశారు.

ఖరీదైన స్థలాలలో రాజధానిని పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. అసలు ప్రభుత్వ భూములలోనే రాజధాని ఉండాలని ఆమె పేర్కొన్నారు. పట్టా భూములకు ఓ రేటు, అసైన్డ్ భూములకు మరో రేటా అంటూ ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు.

MLA undavalli Sridevi gives new meaning to CRDA; comments on capital amaravati

గతంలోను రాజధాని అమరావతిపై ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు రైతుల నుండి ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్ల రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహంతోనే ఉన్నారు. రాజధాని అమరావతి రైతుల ఉద్యమాన్ని టీడీపీ సాగిస్తున్న ఉద్యమంగా, పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాగా ఆమె విమర్శించారు.

ఈ క్రమంలో తాజాగా ఉండవల్లి శ్రీదేవి మరోమారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సిఆర్డిఏ అంటేనే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అంటూ, సీఆర్డీఏ మొత్తం చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. రాజధాని అమరావతి విషయంలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఉండవల్లి శ్రీదేవి.

English summary
YSRCP Tadikonda MLA Undavalli Sridevi made interesting remarks on the capital Amaravati. Sridevi commented that CRDA should be Chandrababu Real Estate Development Authority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X