• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రాణం పోయినా వైసీపీలో చేరను, జగనే అలా, రవిని చంపుతారని తెలుసు: వంశీ సంచలనం

By Narsimha
|

అమరావతి: వైసీపీలో చేరుతాననేది ఉహగానమేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు.ప్రాణం పోయినా జగన్ తో అసోసియేట్ కాబోనని వంశీ తేల్చి చెప్పారు గన్నవరం సీటు కోసం తాను గతంలో జగన్‌ను ఆలింగనం చేసుకొన్నట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని వంశీ చెప్పారు.పరిటాల రవితో పాటు తనను కూడ చంపుతారనే సమాచారం తనకు ఆ సమయంలో ఉందని వంశీ చెప్పారు.

పరిటాల రవిపై దాడి చేస్తారని తెలుసు, జెసి కుటుంబంతో విభేదాల్లేవు, 3 నెలలు ముందే పంపారు: చమన్

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. పరిటాల రవి హత్యతో పాటు ఇతర అంశాలను కూడ వల్లభనేని వంశీ ప్రస్తావించారు.

'పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమదే, వైఎస్ చెప్పినట్టు వింటే మరోలా ఉండేది'

తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు.టిడిపి వద్దనుకొంటే తాను హైద్రాబాద్ లో రాజకీయాలు చేస్తానని వంశీ చెప్పారు.

ప్రాణం పోయినా జగన్‌తో అసోసియేట్ కాలేను

ప్రాణం పోయినా జగన్‌తో అసోసియేట్ కాలేను

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో తాను ప్రాణం పోయినా అసోసియేట్ కాలేనని గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ చెప్పారు. తన తండ్రి యూటీఎప్ వ్యవస్థాపకుల్లో ఒకరని చెప్పారు. తమది కమ్యూనిష్టు కుటుంబమని చెప్పారు. కానీ, ఆ తర్వాత తాను టిడిపిలో చేరినట్టు వంశీ మోహన్ చెప్పారు.తాను మొదటి నుండి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు అలాంటిది వైసీపీలో ఎలా చేరుతానని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. తాను వైసీపీలో చేరుతాననేది ఊహగానమేనని వంశీ చెప్పారు.

జగన్ బండి దిగి కౌగిలించుకొన్నాడు

జగన్ బండి దిగి కౌగిలించుకొన్నాడు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తాను వైసీపీ చీఫ్ జగన్‌ కలవడం ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదన్నారు. ఆ రోజున తాను చాలా అసౌకర్యంగానే ఫీలయ్యాయని వంశీ గుర్తు చేసుకొన్నారు. ఆ రోజున దమ్ము సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో విజయవాడలో జగన్ ర్యాలీ సాగుతోందని ఆయన చెప్పారు అయితే ర్యాలీలో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని చూసేందుకు తాను వస్తుండగా జగన్ తన కారులో నుండి దిగి తనను కౌగిలించుకొన్నారని ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో తాను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాయని ఆయన చెప్పారు. ఆ రోజున తన విజువల్స్ ను చూస్తే తన ఫీలింగ్స్ తెలుస్తాయని వంశీ చెప్పారు.

 బాబును బ్లాక్ మెయిల్ చేసే దమ్ము లేదు

బాబును బ్లాక్ మెయిల్ చేసే దమ్ము లేదు

2014 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ సీటు తనకు కేటాయించేందుకు వీలుగానే జగన్ విజయవాడ వచ్చిన సమయంలో తనతో కలిశాననే విషయంలో వాస్తవం లేదని వంశీ కొట్టిపారేశారు . 2009 ఎన్నికల సమయంలో గన్నవరం నుండి విజయవాడ పార్లమెంట్ స్థానానికి మారాలని బాబు సూచనతోనే తాను మారాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. బాబు ఏం చెబితే తాను అలా చేస్తానని ఆయన చెప్పారు.చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసే దమ్ము తనకు లేదన్నారు. పార్టీకి తాను పనికిరాదని భావించి చెబితే హైద్రాబాద్ లో వ్యాపారాలు చేసుకొంటానని వంశీ మోహన్ చెప్పారు.

నన్ను చంపేందుకు కూడ ప్లాన్

నన్ను చంపేందుకు కూడ ప్లాన్

పరిటాల రవి సన్నిహితుడిగా ఉన్న తనను కూడ చంపేందుకు ప్లాన్ చేశారని వల్లభనేని వంశీ చెప్పారు. పరిటాల రవి బతికున్న సమయంలో ఈ విషయాన్ని తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు. చనిపోవడానికి కొద్ది రోజుల మందు రవి ఈ విషయాన్ని చెప్పి జాగ్రత్తగా ఉండాలని సూచించాడని వంశీ చెప్పారు.

పరిటాల రవిని చంపుతారని తెలుసు

పరిటాల రవిని చంపుతారని తెలుసు

పరిటాల రవిని చంపుతారని తెలుసునని వంశీ చెప్పారు. రవి చనిపోవడానికి నెల రోజుల ముందే ఈ విషయమై రవితో పాటు తమ మధ్య చర్చకు వచ్చిందని వంశీ చెప్పారు. నాలుగైదు టీమ్‌లు పనిచేస్తున్నాయని తమకు తెలుసునని వంశీ చెప్పారు. చిన్నప్పటి నుండి ఈ విషయాలన్నీ రవి చూసీ చూసీ అలవాటు చేసుకొన్నారని చెప్పారు. పరిటాల రవిగానే బతకాలనుకొన్నాడని చెప్పారు. పారిపోయి బతకాలనుకోలేదన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vallabhaneni Vamsi is the MLA from Gannavaram constituency in Krishna District in the state of Andhra Pradesh. Vallabhaneni Vamsi explained that YSR supported state sponsored crime to eliminate leaders like Paritala Ravi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more