పవన్ మాటతీరు బాధించింది: ఢిల్లీ పిలుపుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటతీరు బాధకలిగిస్తోందని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ పవన్ అంటే తమకు చాలా అభిమానమని చెప్పారు.
విశాఖలో కేబుల్ వైర్లు కట్: పవన్ కాకినాడ స్పీచ్ చూడకుండా చేశారు
ప్రజల సెంటిమెంట్ కంటే రాష్ట్రాభివృద్ధి కంటే తన ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విశాఖకే రైల్వేజోన్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్ని పార్టీల అంగీకారంతోనే రాష్ట్ర విభజన: ఎంపీ హరిబాబు
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాతే రాష్ట్ర విభజన జరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు గుర్తుచేశారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అధికారంలో ఉన్న తమ మిత్రపక్షం టీడీపీ అంగీకారంతోనే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని అన్నారు.
ప్రజలు, ఆందోళనకారులు, విమర్శకులు, టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్యాకేజీని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్యాకేజీ గురించి వివరిస్తారని ఆయన తెలిపారు. దీనిని టీడీపీ, బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేటాయించడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
కాకినాడ సభలో బీజేపీపై మండిపడ్డ పవన్
కాగా, పవన్ కళ్యాణ్ 'సీమాంధ్ర ఆత్మగౌరవ సభ' కారణంగా శనివారం ఉదయానికల్లా ఢిల్లీకి రావాలంటూ బీజేపీ నేతలు, బీజేపీ శానససభాపక్ష నేతకు పిలుపొచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లోని తాజా పరిణామాలను బీజీపీ అధిష్టానం తీవ్రంగా పరిగమిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు ఢిల్లీకి రావాలంటూ హైకమాండ్ ఆదేశించింది.
వెంకయ్య ఏపీలో బీజేపీని చంపేశారు: పవన్, బీజేపీ నేతలకు ఢిల్లీ పిలుపు
కాగా, కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీపై కాస్తంత తీవ్రంగానే స్పందించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే అన్నీ హ్యాపీడేస్ అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు అరచేతిలో స్వర్గం చూపించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారు చెప్పిన హ్యాపీ డేస్ ఇప్పుడు కనిపించడం లేదన్నారు.
మూడు నాలుగు సంవత్సరాలుగా హోదా ఇస్తామంటూ, తిపికబురు వస్తోంది అంటూ పాచి కంపు కొట్టే రెండు లడ్డూలిచ్చారని పవన్ అన్నారు. మీ పార్టీ ఇచ్చిన తీర్మానం కంటే భారత రాజ్యాంగానికి విలువ లేదా అని ప్రశ్నించారు. చట్టసభలో చేసిన చట్టాల కంటే మీ హామీలే ఎక్కువా అని బీజేపీ నేతలను ప్రశ్నంచారు.












Click it and Unblock the Notifications