ఇసుక ఫుల్ డ్యామేజ్..చంద్రబాబుకు తేల్చేసిన ఎమ్మెల్యేలు

ఏపీ రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా నిర్వహించారు. అయితే తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు.

ఇసుక ఫ్రీనే కాని ఆ ఇసుకు లబ్దిదారుడు ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక తమ ప్రభుత్వంలోనే చౌకగా దొరికిందని, ఇప్పుడు ఒక టన్నుకు రూ.1300 రూపాయిలు వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఫ్రీ విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికి , ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం.

MLAs discussed with CM Chandrababu about free supply of sand

దీనిపై ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చ‌య్య‌. గుర‌జాల జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ఇసుక ఉచిత స‌ర‌ఫ‌రా గురించి సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేయడం లేదు. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో ట‌న్ను ఇసుకకు ఎంత ఖ‌ర్చు అయ్యేదో, ఇప్పుడు కూడా అంతే అవుతోందనే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు.

ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇంటికి చేరే స‌రికి పాత ధ‌రే అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు అసంతృప్తిగా, ఆగ్ర‌హంగా ఉన్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్ర‌స్తుతం ఇసుక రీచ్‌లు పూర్తిస్థాయిలో తెర‌వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇసుక స‌ర‌ఫ‌రాకు కొంత మొత్తంలో ఖ‌ర్చు అవుతుందని, స్టాక్ యార్డ్‌ల‌లో ఉన్న ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంతో ఖ‌ర్చు క‌నిపిస్తోంద‌ని ఎమ్మెల్యేలకు చంద్రబాబు తెలిపారు. ఇసుక రీచ్‌ల విషయంలో ఎవరూ కలుగజేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+