Ysrcp: ఆ ముగ్గురు కీల‌క నేత‌ల‌కు ఎమ్మెల్సీ అనంత‌బాబు బినామీ??

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు కీల‌క నేత‌ల‌కు ఎమ్మెల్సీ అనంతబాబు బినామీనా? వారి నుంచి ఆయ‌న‌కు పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ఉందా? గంజాయి నుంచి గ‌నుల వ‌ర‌కు అన్ని వ్య‌వ‌హారాలు వారి త‌ర‌ఫున చ‌క్క‌బెడుతున్న‌ది ఆయ‌నేనా? ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక లావాదేవీల‌న్నీ అనంత్‌బాబు బినామీగా చ‌క్క‌బెడుతున్నారా? అనే కీల‌క ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ఔన‌నే స‌మాధానం చెబుతున్నారు.

 గ‌నుల నుంచి గంజాయి వ‌ర‌కు

గ‌నుల నుంచి గంజాయి వ‌ర‌కు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌కు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి ఎమ్మెల్సీ అనంత‌బాబు బినామీ అని హ‌ర్ష‌కుమార్ మీడియాకు వివ‌రించారు. ఏజెన్సీ ప్రాంతంలో గ‌నుల నుంచి గంజాయి వ‌ర‌కు జ‌రిగే అక్ర‌మాల‌న్నీ అనంతబాబు క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంటాయ‌ని, అత‌డికి ఏ స్థాయి మ‌ద్ద‌తు లేక‌పోతే ఒక వ్య‌క్తిని హ‌త్య‌చేసి కారులో పెట్టుకొని తీసుకొచ్చి అప్ప‌జెబుతాడో ఆలోచించండి అంటూ మీడియావారితో అన్నారు.
సుబ్ర‌మ‌ణ్యం మృతిపై హైకోర్టు క‌ల‌గ‌జేసుకొని సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే కీల‌క విష‌యాలు బ‌య‌ట‌క వ‌స్తాయ‌న్నారు.

 అన్ని వివ‌రాలు డ్రైవ‌ర్‌కు తెలుసు.. అందుకే!!

అన్ని వివ‌రాలు డ్రైవ‌ర్‌కు తెలుసు.. అందుకే!!

అనంత‌బాబుకు సంబంధించిన గెస్ట్ హౌస్‌లు, ఇత‌ర ర‌హ‌స్య ప్ర‌దేశాల‌తోపాటు అత‌ను చేసే అన్ని అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు సుబ్ర‌మ‌ణ్యంకు తెలుస‌ని, అత‌ని ద‌గ్గ‌ర ఐదు సంవ‌త్స‌రాలు కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన‌ప్పుడు అన్ని విష‌యాలు తెలుస్తాయ‌న్నారు. వీటికి సంబంధించిన వివ‌రాల‌ను కొంద‌రి ద‌గ్గ‌ర చ‌ర్చిస్తున్నాడ‌నే స‌మాచారం అందుకున్న త‌ర్వాతే అనంత‌బాబు సుబ్ర‌మ‌ణ్యంను హ‌త్య‌చేశాడ‌ని హ‌ర్ష‌కుమార్ వెల్ల‌డించారు.

 అర్థ‌రాత్రి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కు త‌ర‌లింపు

అర్థ‌రాత్రి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కు త‌ర‌లింపు

త‌న మాజీ కారు డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యాన్ని హ‌త్య‌చేసిన‌ట్లుగా అనంత‌బాబు పోలీసుల ఎదుట అంగీక‌రించారు. నిందితుణ్ని కాకినాడ స్పెష‌ల్ మొబైల్ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రుప‌రిచి అర్థ‌రాత్రి 1.15 గంట‌ల స‌మ‌యంలో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కు త‌ర‌లించారు. సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య‌కేసులో ఇంకా ఎవ‌రి ప్ర‌మేయ‌మైనా ఉందా? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్పీ వెల్ల‌డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+