బాబు ఒక భగత్‌సింగ్, దమ్ముంటే బాబుతో మోడీని మాట్లాడమను: బుద్దా వెంకన్న

అమరావతి: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు టీడీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. దేశంలో జీవిఎల్ లాంటి ఎంతోమందిని తయారుచేసిన వ్యక్తి చంద్రబాబు అన్న సంగతి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు.

చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన సంస్కారాన్ని చూసి నేర్చుకున్న మోడీ.. ఆ స్ఫూర్తితోనే గుజరాత్ లో పాలన కొనసాగించారన్న రీతిలో వెంకన్న వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిని బెదిరించేంత సీన్ బీజేపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. చంద్రబాబు.. ఒక చెంప మీద కొడతే మరో చెంప చూపించే గాంధీ అని అన్నారు.

mlc buddha venkanna challenges gvl narasimharao

రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాల రీత్యా ఆయన సౌమ్యంగా ఉంటారని, చంద్రబాబు గనుక తిరగబడితే ఆయనలో ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజును చూస్తారని పేర్కొన్నారు. జీవీఎల్ రాష్ట్రానికి చేసిందేమి లేదని, మోడీ కాళ్ల వద్ద జపం చేసుకునే వ్యక్తి అని విమర్శించారు. బీజేపీకి దమ్ముంటే మోడీ గానీ, అమిత్ షా గానీ చంద్రబాబుతో మాట్లాడాలని దానికి ఆయన సమాధానం చెబుతారని అన్నారు. అంతే తప్ప నీలాంటి అడ్రస్ లేని వ్యక్తులకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+