Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూటమిలో కొత్త టెన్షన్- మారుతున్న లెక్కలు, చంద్రబాబు అలర్ట్..!!

ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ సమయంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల మూడ్ ఏంటనేది కీలకంగా మారుతోంది. గ్రాడ్యుయేట్ల నాడి కూటమి పైన ఎలా ఉందో తెలిసిపోనుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సిద్దమైంది. అయితే, క్షేత్ర స్థాయిలో మారుతున్న లెక్కలు కూటమి నేతల్లో టెన్షన్ పెంచుతున్నా యి. దీంతో.. సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

కూటమికి ప్రతిష్ఠాత్మకం
రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్లు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ల సీట్ల గెలుపు కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో
హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఉభయగోదావరి, కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దులకు పీడీఎఫ్ గట్టి ఫైట్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానం లో మాత్రం యూనియన్స్ మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన కూటమి పార్టీల కేడర్ ను అలర్ట్ చేస్తున్నారు.

MLC Elections in AP becomes prestigious for Chandra Babu and Pawan Kalyan Details here

చంద్రబాబు అలర్ట్
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాల్ గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ కల్పన.. డీఎస్సీ నిర్వహణ అమలు పైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోనూ లోపం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి - క్రిష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు తున్నాయి. గుంటూరు-కృష్ణాజిల్లాల ప‌రిధిలో నాయ‌కుల స‌మ‌న్వ‌యం కొర‌వ‌డడినట్లు నివేదిక లు చంద్రబాబుకు అందినట్లు సమాచారం. దీంతో, మూడు పార్టీల నేతలతో చంద్రబాబు పలు మార్లు టెలికాన్ఫిరెన్స్ నిర్వహించి మార్గనిర్దేశం చేసారు.

మంత్రులకు సవాల్
క్రిష్ణా - గుంటూరు నియోకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్దికి కొందరు కూటమి నేతల నుంచే సహకారం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేదు. కానీ, పీడీ ఎఫ్ అభ్యర్దులు గట్టి పోటీ ఇస్తు న్నారు. ఇక, గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పేరాబత్తు ల రాజ‌శేఖ‌ర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేరాబత్తులకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు తో పాటుగా ఇతరులు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఎన్నికా పరీక్షవంటిదేనని...మూడు పార్టీల అభ్యర్థులు కలిసి కట్టుగా పనిచేయాలని నిర్దేశించారు. ఇక.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో.. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+