ఆ ఊరు చంద్రబాబుది..అయినా ఆ "మునికన్నప్ప" స్టైల్ ఏ వేరు..!...రెడ్ బుక్ కాస్త బ్లడ్ బుక్

Kuppam women incident: దశాబ్దాల కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టం కడుతూ వస్తోన్న కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న అమానుష ఘటన అందరినీ కదిలించివేసింది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తోన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోన్నారు.

80,000 రూపాయల అప్పు తీర్చలేదనే కారణంతో శిరిష అనే మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుప్పం మండలం నారాయణపురంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

MLC KRJ Bharat criticized AP Govt over Kuppam women incident

నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య శిరీష, బిడ్డలను వదిలి వెళ్లిపోయాడు. శిరీష గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ అప్పులు తీరుస్తోన్నారు.

సకాలంలో అప్పు చెల్లించలేదనే కారణంతో శిరీషను అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు మునికన్నప్ప. ఆమెను ఈడ్చుకొంటూ తీసుకెళ్లి తాడుతో చెట్టుకు కట్టివేశాడు. బ్రతిమిలాడినా వినకుండా చీర లాగేశాడని, తనను కొట్టారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన పట్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్‌ మండిపడ్డారు. కుప్పంలో ప‌చ్చ మాఫియా దౌర్జ‌న్యానికి అంతు లేకుండా పోయింద‌ని, అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సభ్య సమాజం తలదించుకునేలా శిరీషను చెట్టుకు కట్టేయడం, ఈ ఘటన చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చోటు చేసుకోవ‌డం సిగ్గుచేటు అన్నారు.

టీడీపీ నాయకులు కుప్పం నియోజకవర్గంలో అనేక దారుణాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనడానికి శిరీష ఘటన ఓ ఉదాహరణ అని భరత్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, కుప్పంలో రెడ్‌ బుక్‌.. బ్లడ్‌ బుక్‌ అయిందని ధ్వజమెత్తారు.

కుప్పం నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ సాగుతోందని, బలవంతంగా భూములు లాక్కుంటున్నారని భరత్ మండిపడ్డారు. అడ్డూఅదుపు లేకుండా అక్రమ మైనింగ్‌, రైస్‌ స్మగ్లింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. రెండు సరిహద్దు రాష్ట్రాలకు అక్రమ తరలింపులు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

సామాన్య ప్రజలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డగోలుగా దోచుకుంటోన్నారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరుగుతుంటే పరిస్ధితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని, బాధితుల పక్షాన పోరాడుతామని భరత్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+