అలా అనుకుంటే వారి కర్మే.. తీవ్ర దుమారంగా నాగబాబు కామెంట్స్ !
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురం సమీపంలోని చిత్రాడలో నిర్వహిస్తున్నారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'జయకేతనం' పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆవిర్భావ సభలో MLC నాగబాబు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయని అన్నారు. అవి ఒక పవన్.. రెండు పిఠాపురం ప్రజలు అని తెలిపారు. అంతేకానీ పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ తెలిపారు. దీంతో నాగబాబు చేసిన కామెంట్స్ పిఠాపురం మాజీ MLA, TDP నేత వర్మను ఉద్దేశించే అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ అంటూ కొనియాడారు. తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జన సైనికుడిని అని చెప్పుకొనేందుకు గర్వపడుతున్నానని వెల్లడించారు.

అలానే పిఠాపురం ప్రజలు జన సైనికులకు రుణపడి ఉన్నామని అన్నారు. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని.. నోటిదురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ చెప్పారన్నారు. ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కల్యాణ్ అని.. అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని, లేదంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని అన్నారు.
జగన్ పై షాకింగ్ కామెంట్స్..
జగన్ కళ్లు మూసి తెరిసే లోపే తొమ్మిది నెలలు గడిచిపోయాయని అంటున్నారని.. ఇంకో సారి కళ్లు మూసి తెరిస్తే ఐదేళ్లు గడచిపోతాయని భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ హాస్యం పండించలేరని.. మరో 20 ఏళ్ల వరకు జగన్ ఇలాగే కలలు కంటూనే ఉండాలని సలహా ఇచ్చారు. ఇక ఈ సభకు జనసేన పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు.












Click it and Unblock the Notifications