India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rs.2.34 లక్షలకే సొంత ఇల్లు!

|
Google Oneindia TeluguNews

ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసిచూడు.. అనేది పెద్దలు చెప్పే సామెత. ఎందుకంటే ఆ రెండు ఎంతటి మహత్కార్యాలో వారికి తెలుసు కాబట్టి. ఇల్లు కట్టాలి అంటే రూ. లక్షల్లో ఖర్చవుతోంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇంటి నిర్మాణ ఖర్చు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ కు సమీపంలోని రాజేంద్రనగర్ లో NIRD (national institu of rural development and panchayathi raj) లోని రూరల్ టెక్నాలజీ పార్కులో అధికారులు తక్కువ వ్యయంతో ఒక నమూనా ఇంటిని నిర్మించారు. తక్కువ ఖర్చు కావడంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా ఈ రకమైన ఇల్లు నిర్మించుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నమూనా ఇంటి హైలైట్స్

ఈ నమూనా ఇంటి హైలైట్స్

1. పాత రోజుల్లో కట్టినట్లుగా పునాదిని రాళ్లతో నిర్మించారు.

2. పునాది నుంచే స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రిని ఉపయోగించుకోవచ్చు.
3. ఇటుకలు, సిమెంటు వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు గోడలను ర్యాట్ ట్రాప్ బాండ్ పద్ధతిలో కట్టారు.
4. ప్రముఖ ఆర్కిటెక్ట్ లారీబేకర్ కేరళలో 1970లో ఈ తరహా నిర్మాణాన్ని చేపట్టారు. దాంతో అప్పటినుంచి ఆయన పేరుతో ఈ మోడల్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఖర్చు తగ్గించేందుకు ఫ్లైయాష్ ఇటుకలను వాడారు.
5. పిల్లర్ స్లాబ్ రూఫ్ నిర్మించారు. పెంకులతో నిర్మించే శ్లాబు ఇది. దీన్నే లారీబేకర్ డిజైన్ అంటారు. కేరళలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల వేసవిలోను చల్లదనం ఉంటుంది. సిమెంటు, కాంక్రీట్ తక్కువగా వాడతారు.
6. పాతరోజుల్లో కట్టినట్లుగా ఇంటి లోపల గోడల ప్లాస్టరింగ్ మట్టితో కట్టారు.

 బయట ప్లాస్టరింగ్ ఉండదు

బయట ప్లాస్టరింగ్ ఉండదు

1. బయట ప్లాస్టరింగ్ చేయరు. ఫ్లైయాష్ ఇటుకలు కాబట్టి ఎటువంటి ప్లాస్టరింగ్ అవసరంలేదు.
2. ఆవుపేడతో తయారుచేసిన ప్రకృతిక్ రంగులు వాడారు.
3. రెండు రంగుల్లో లభించే తాండూరు బండలను గచ్చు కోసం ఉపయోగించారు. దీనివల్ల ఫ్లోరింగ్ అందంగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.
4. ఒక్కో చదరపు అడుగుకు రూ.683 ఖర్చైందని NIRD అధికారులు వెల్లడించారు.

సౌరవిద్యత్తు ఏర్పాటు చేసుకోవచ్చు

సౌరవిద్యత్తు ఏర్పాటు చేసుకోవచ్చు

1. ఈ నమూనా ఇంటిపై 2 కిలోవాట్ సౌరపలకలను ఏర్పాటు చేయడంతో ఇంటి అవసరాలకు కావాల్సిన విద్యుత్తు ఇంటి పై నుంచే ఉత్పత్తి అవుతుంటుంది. ప్రతిరోజు 8 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. చిన్న ఇంటికైతే సంవత్సరం పొడవునా ప్రతిరోజు 4 యూనిట్లకు మించి అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు.
2. ఈ నమూనా ఇంట్లో ఎల్ఈడీ లైట్లు, విద్యుత్తు ఆదా చేసే ఫ్యాన్లు, సౌర విద్యుత్తుతో నడిచే స్టవ్ ను అమర్చారు. రోజుకు 2 యూనిట్లకు మించి ఖర్చు కాదు. వేసవికాలంలో అయితే కాస్తంత ఎక్కువ వినియోగం ఉంటుంది.
3. మిగిలిన యూనిట్లను నెట్ మీటర్ ద్వారా గ్రిడ్ కు అనుసంధానించడంద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం యూనిట్ కు రూ. 4.19 చొప్పున డిస్కం వినియోగదారులకు చెల్లిస్తోంది. ప్రతి 6 నెలలకు ఈ నగదును చెల్లిస్తారు.
4. ఇంటిపై ఈ సౌరవిద్యుత్తు యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.రూ.1.06 లక్షలు అవుతుంది.

English summary
Officials constructed a model house at NIRD Rural Park in Rajendranagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X