ఏపీకి భారీ ఊరట: అనుకూలం
Rains in AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది.
రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఎండ తీవ్రత భారీగా ఉంటోంది. మండు వేసవిని తలపిస్తోంది. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. దీనికి- విద్యుత్ కోతలు తోడయ్యాయి. గుంటూరు వంటి నగరాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా స్తంభించిపోతోంది. గ్రామీణ స్థాయిలో కోతలు మరింత ఎక్కువగా ఉంటోన్నాయి.

ఈ పరిస్థితుల నుంచి ఏపీకి ఊరట లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. బలమైన గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని ఎస్డీఎంఏ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడటానికి అనుకూల వాతావరణం నెలకొంది. శ్రీకాకుళంలో చిరు జల్లులు పడొచ్చు.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని ఎస్డీఎంఏ పేర్కొంది.












Click it and Unblock the Notifications