గ్రామ్‌ఫోన్, ఎల్‌పి రికార్డు పాతవే, చూశారా? (పిక్చర్స్)
హైదరాబాద్: తమ సంస్థ ఆధ్వర్యంలో ‘రి కలెక్షన్స్-ఓల్డ్ ఈజ్ బోల్డ్' పేరిట ఆధునిక, పురాతన వస్తువుల, చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మారియా క్లారస్ బిబ్లికల్ ఆర్ట్ గ్యాలరీ పేర్కొంది. ఈ సందర్భంగా సంబంధించిన కొన్ని చిత్రాలను ప్రదర్శనకు ఉంచుతున్నట్లు తెలిపింది. ఈ ప్రదర్శన డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం జరుగుతోందని పేర్కొంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని, వివరాల కోసం మొబైల్ నెం. 98480-25608ను సంప్రదించవచ్చని తెలిపింది.
తమ కంటే ముందు కాలంలోని వస్తువులను, చిత్రాలను ప్రస్తుత తరాలకు గుర్తుకు తేవడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. తమ ప్రదర్శనలో పురాతన వస్తువులను ప్రస్తుత తరానికి పరిచయడం చేసి భవిష్యత్‌లోకి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. తమ ప్రదర్శనలు స్పూర్తిదాయకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కళాకారులు, ఎగ్జిబిషన్ క్యూరేటర్ మారియా క్లారా తెలిపారు.
ప్రదర్శనలో నిజాం కాలంనాటి పలు వస్తువులను, చిత్రాలను ప్రదర్శనకు ఉంచుతున్నట్లు చెప్పారు. సింగపూర్‌లో తయారైన టెలిఫోన్, టేబుల్ ప్యాన్, బ్లాక్ టెలిఫోన్ డైలర్‌తో కూడినది, పురాతన గ్రాంఫోన్, అద్దాలు, మంచం, టేబుల్, ఎల్‌పి రికార్డుతో కూడిన యాషికా ఎంజి2 స్టిల్ కెమెరా, న్యూయార్క్‌కు చెందిన ఈస్ట్‌మన్ కోడక్ జూమ్8 ఆటోమెటిక్ కెమెరా, ఇండియలో తయారైన గావెర్డ్ గేవబాక్స్ కెమెరా, 70 ఏళ్ల క్రితం నాటి స్టూల్, టేబుల్, వివాహ సమయంలో ఉపయోగించిన అలనాటి చీరలు, పలు దశాబ్దాలకు చెందిన పరికరాలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు.
కాలం మారుతున్న కొద్ది అనేక కుటుంబాలు పురాతన వస్తువులను పారేస్తూ పోతుంటారని, అయితే చిలుకూరి కుటుంబం మాత్రం అలా కాకుండా పురాతన వస్తువులన్నింటినీ సుమారు ఐదు దశాబ్ధాల నుంచి కాపాడుతూ వస్తోందని మారియా తెలిపారు. 100 సంవత్సరాల నాటి పుస్తకం, టైప్ రైటర్, హుక్కా, అమెరికాలోని చికాగో విజువల్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఫిల్మ్ ప్రొజెక్టర్ లాంటి పురాతన వస్తువులను ప్రదర్శించనున్నట్లు మారియా క్లారా వివరించారు.

పురాతన టెలిఫోన్
తమ సంస్థ ఆధ్వర్యంలో ‘రి కలెక్షన్స్-ఓల్డ్ ఈజ్ బోల్డ్' పేరిట ఆధునిక పురాతన వస్తువుల, చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మారియా క్లారస్ బిబ్లికల్ ఆర్ట్ గ్యాలరీ పేర్కొంది. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు జరగనున్న ప్రదర్శనకు పెట్టనున్న పురాతన డైలర్ టెలిఫోన్.

అలనాటి ఫ్యాన్
తమ సంస్థ ఆధ్వర్యంలో ‘రి కలెక్షన్స్-ఓల్డ్ ఈజ్ బోల్డ్' పేరిట ఆధునిక పురాతన వస్తువుల, చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మారియా క్లారస్ బిబ్లికల్ ఆర్ట్ గ్యాలరీ పేర్కొంది. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు జరగనున్న ప్రదర్శనకు పెట్టనున్న అలనాటి టేబుల్ ఫ్యాన్.

ఎగ్జిబిషన్ గ్యాలరీ చిత్రం
తమ సంస్థ ఆధ్వర్యంలో ‘రి కలెక్షన్స్-ఓల్డ్ ఈజ్ బోల్డ్' పేరిట ఆధునిక పురాతన వస్తువుల, చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మారియా క్లారస్ బిబ్లికల్ ఆర్ట్ గ్యాలరీ పేర్కొంది. ప్రదర్శనకు ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్న అలనాటి చిత్రం.

పురాతన గ్రాంఫోన్
తమ సంస్థ ఆధ్వర్యంలో ‘రి కలెక్షన్స్-ఓల్డ్ ఈజ్ బోల్డ్' పేరిట ఆధునిక పురాతన వస్తువుల, చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మారియా క్లారస్ బిబ్లికల్ ఆర్ట్ గ్యాలరీ పేర్కొంది. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు జరగనున్న ప్రదర్శనకు పెట్టనున్న అలనాటి గ్రాంఫోన్.












Click it and Unblock the Notifications