బాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయం
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ బీజేపీతో ఎలా మసలుకోవాలా అనే ఆలోచనలో ఉంది. బడ్జెట్‌లో అన్యాయం నేపథ్యంలో విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.
Recommended Video

చదవండి: జగన్‌కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?
చదవండి: అద్భుతం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే లేదు, బాబును లైట్‌గా తీసుకున్నా: ముఖేష్ అంబానీ ప్రశంసలు
రేపో మాపో బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటారని భావించారు. అంతలోనే మార్చి 5 వరకు కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. ఆ తర్వాత కర్నాటక ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలనే ఆలోచనలోను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది.
చదవండి: రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్

చంద్రబాబు ఆలోచన
ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను తగ్గే ప్రసక్తి లేదు. అదే సమయంలో కేంద్రంతో ఇప్పుడే తెగదెంపులు చేసుకోకుండా ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన ఆలోచనలకు తోడు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు.

చంద్రబాబును బుజ్జగించాలని షా, జైట్లీలకు మోడీ సూచన
కేంద్ర బడ్జెట్ అనంతరం టీడీపీ ఆగ్రహం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును బుజ్జగించే బాధ్యతను ప్రధాని మోడీ.. అమిత్ షా, జైట్లీలకు అప్పగించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఆయనతో మాట్లాడి ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ పెద్దలు టీడీపీ అధినేతతో పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే టీడీపీ డెడ్ లైన్ మారుతోందని అంటున్నారు.

చంద్రబాబు చక్రం తిప్పారు కానీ
బీజేపీ ముఖ్యనేతలు టీడీపీ అధినేతతో అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారని, మాట్లాడుతారని అంటున్నారు. గతంలో దేవేగౌడ, వాజపేయి హయాంలో చంద్రబాబు చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. దీంతో గట్టిగా అడగలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పెద్ద మిత్రపక్షమైన టీడీపీని వదులుకునేందుకు సిద్ధంగా లేదు.

టీడీపీని వదులుకుంటే బీజేపీ ముందు మరో పెద్ద భయం
టీడీపీని వదులుకుంటే జాతీయస్థాయిలో మిత్రపక్షాల విషయంలో బీజేపీ సరిగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందనే కమలం పార్టీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. అయితే దాని కంటే మరో పెద్ద భయం దాని ముందు ఉందని అంటున్నారు. త్వరలో కర్నాటక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరాది కంటే దక్షిణాదిపై ఉత్తరాది పార్టీలకు చిన్నచూపు అని బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాదిన కీలక రాష్టమైన ఏపీలో టీడీపీ దూరమైతే దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ అనే అభిప్రాయం ఏర్పడుతుందని, అది కర్నాటక ఎన్నికల పైన పడే అవకాశాలు లేకపోలేదని, అందుకే బీజేపీ కూడా టీడీపీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందని అంటున్నారు.

ఎవరో ఒత్తిడి చేస్తే మోడీ తగ్గరు
బీజేపీ - టీడీపీ ఇష్యూపై ఓ బీజేపీ నేత మాట్లాడుతూ.. కేవలం చర్చల ద్వారానే ఏపీకి మరిన్ని నిధులు వస్తాయని, ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చంద్రబాబు గ్రహించారని, మెజార్టీ ఉన్నా లేకున్నా అందరి నేతల్లా మోడీ కాదని, ప్రజల కోసం, దేశం కోసం తన దారిలో తాను వెళ్తారని, ఎవరో ఒత్తిడి చేస్తే తగ్గే రకం కాదని చెబుతున్నారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications